ఆంధ్ర స్వామీజీల ఎజెండా ఏమిటో?

మనకు తరచు వినిపించే మాట ఒకటి వుంది. ఈ దేశంలో ఎవరికి వారు, వాళ్ల పని తప్ప అన్నీ చేస్తారు అన్నదే ఆ మాట. మనకు బోలెడు మంది స్వామీజీలు వున్నారు. సర్వసంగపరిత్యాగులు కాదు. …

మనకు తరచు వినిపించే మాట ఒకటి వుంది. ఈ దేశంలో ఎవరికి వారు, వాళ్ల పని తప్ప అన్నీ చేస్తారు అన్నదే ఆ మాట. మనకు బోలెడు మంది స్వామీజీలు వున్నారు. సర్వసంగపరిత్యాగులు కాదు. 

కౌపీన సంరక్షణార్థం హయం పటాటోపం అన్నట్లుగా విలాసవంతమైన వ్యవహారాలు అన్నీ వున్న స్వామీజీలు. ఆశ్రమాలు వాటి కోసం ప్రభుత్వం స్థలాలు, అలాగే ఆంధ్ర , తెలంగాణ, ఇంకా మాట్లాడితే ఉత్తరాది ఇంకా జిల్లాల వారీగా బ్రాంచ్ ఆఫీసుల మాదిరిగా ఆశ్రమాలు వుంటాయి. 

ఇవి చాలక ఆలయాలు నిర్మించి, వాటిని నిర్వహించడం కొత్త కాన్సెప్ట్ ఒకటి వుండనే వుంది. ఏ స్వామీజీకి అనుబంధంగా ఆ స్వామీజీ ఆశ్రమం నిర్వహించే  ఆలయాలు వుంటూనే వుంటాయి. భక్తుల సహకారంతో నిర్మింపచేయడం, నిర్వహణ మాత్రం తమ చేతుల్లో వుంచుకోవడం. ఇలా మాట్లాడితే చాలా మందికి కోపం రావచ్చు. కానీ అంగీకరించడానికి మనసు రాని నిజాలు అందరికీ తెలిసినవే. 

నిజానికి హిందూధర్మం లేదా హిందూ మతం పలుచన అవుతున్నది పరాయి వాళ్ల కన్నా ఇలాంటి సోకాల్డ్ సెలబ్రిటీ స్వామీజీల వల్లనే అనే విమర్శ కూడా వుంది. లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే స్వామీజీలు రాజకీయాలు కూడా పట్టించుకోవడం. రాజకీయాశ్రితులు అంతా స్వామీజీల చుట్టూ తిరుగుతుంటారు. 

ఎవరి అనుకూల ప్రభుత్వం అధికారంలో వుంటే ఆ స్వామీజీ హవా నడుస్తుంటుంది.  హవా నడవని వారు ప్రభుత్వంపై విమర్శలు లకించుకుంటారు. అయితే మన అదృష్టం ఏమిటంటే ఇలాంటి స్వామీజీల్లో కొందరయినా నికార్సుగా హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణ కోసం పనిచేయడం. 

సరే అదంతా వేరే విషయం. ఇంతకీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే తెలుగు నాట స్వామీజీలు అంతా కలిసి ఈరోజు సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారట. అది కూడా ఎక్కడా? ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ లో, తిరువళ్లూరు జిల్లా పొన్నాడిలో. ఆంధ్రకు చెందిన ఎవరో స్వామీజీ ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసారట. డజనకు పైగా స్వామీజీలు వస్తారట. 

వైకాపా అనుకూల స్వామీజీలు అయితే రహస్య సమావేశం అక్కరలేదు. పైగా మన స్టేట్ దాటి వెళ్లి అక్కడ రహస్య సమావేశం పెట్టాల్సిన పని లేదు. అంటే వైకాపా వ్యతిరేక స్వామీజీలు అనుకోవాలి. 

ఇంతకీ ఈ సమావేశం తమిళనాడు కోసమా? ఆంధ్ర కోసమా? తమిళనాడు కోసం అయితే ఆంధ్ర స్వామీజీలతో పని లేదు. అంటే ఆంధ్ర స్వామీజీలు, తమిళనాడు బోర్డర్ లో రహస్య సమావేశం అంటే వ్యవహారం ఏమిటో మరి?  విషయం వైకాపా వ్యతిరేకంగా ఆవ గింజ అంత వున్నా, దేశం మీడియాలో ఆనపకాయ అంత అయిపోయి, పతాక శీర్షికలకు ఎక్కడం ఖాయం..వెయిట్ చేయాలంతే.

చంద్ర‌బాబు త‌న స్థాయి మ‌రిచి రాజ‌కీయాలు చేస్తున్నారు

అతి చేస్తోన్న మీడియా