ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుపై ఉత్కంఠకు తెరపడింది. విచారణకు ఆయన హాజరవుతారా, లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. విచారణకు హాజరవడానికి కేటీఆర్ మొగ్గు చూపారు. ఈ కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడు.
విచారణకు వెళ్లడానికి ముందు నందినగర్‌లోని తన ఇంట్లో న్యాయవాదులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగొచ్చే సమాచారంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
“ఎలాగైనా తనను అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో ఉన్నారు” అని కేటీఆర్ విమర్శించారు. జరగని అవినీతి కేసులో తనను ఇరికించారంటూ కేటీఆర్ వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఏం జరిగిందో చెప్పకుండా, కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల నెగ్గుతుందా? లేక కేటీఆర్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనం దక్కుతుందా? అనేది తేలాల్సి ఉంది.
veediki artmah kavatam leda natistunnada.55 kotlu punyaniki ichadu ani cheputunte