దేశ ప్రధాని ఒక ప్రాంతానికి వస్తున్నారు అంటే కచ్చితంగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. రెడ్ కార్పెట్ పరుస్తారు. నరేంద్ర మోదీ లాంటి బలమైన ప్రధాని, మూడోసారి దేశానికి నేతృత్వం వహిస్తున్న నేత, ఏపీలో కేంద్రంలో కూడా కూటమి కట్టి బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ, జనసేన ఉన్న రాష్ట్రానికి మోదీ వస్తున్నారు.
మూడోసారి ప్రధాని అయిన తరువాత మోదీ జరుపుతున్న అధికారిక పర్యటన ఇదే కావడం ఒక ప్రత్యేకత. విశాఖలో మోదీ పర్యటన నాలుగు గంటల పాటు సాగనుంది. దాంతో మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రుల బృందాన్ని నియమించింది. నారా లోకేష్ మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు అవసరం అయిన ఏర్పాట్లను పరిశీలించేందుకు మూడు రోజుల ముందే విశాఖలో మకాం వేశారు.
మోదీకి అపూర్వమైన స్వాగతాన్ని పలకాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ రోడ్ షో నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఈ రోడ్ షోకు వేలాదిగా జనాలను పాల్గొనేలా చూస్తున్నారు. ఒక లక్ష మందికి తక్కువ కాకుండా ఏయూ గ్రౌండ్స్‌లో సభను నిర్వహించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ఒక విధంగా చూస్తే మోదీకి విశాఖలో మరపురాని స్వాగతం పలకాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మోదీకి విశాఖలో ఘన స్వాగతం పలకడం బాగానే ఉంది. ఆయనకు విశాఖ ఇచ్చే ఆతిథ్యం నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా ఉండడం వరకూ ఓకే అయినా, మోదీ కూడా ఈ ఘన స్వాగతానికి పరవశించి విశాఖతో సహా ఏపీకి వరాలు కురిపిస్తారా అన్నది అంతా తర్చికుంటున్నారు.
modi o lucha
కూటమి ముసుగులో మా పనులకి అడ్డం కల్పించవద్దు, రాష్ట్రాన్ని ఎలా కావలిస్తె అలా నువు వాడుకో.. ఇవె వాల్ల ఒప్పందాలు… ఇంకా వరాలేమిటి.. జనాలకి పంగనామాలే..
idhedho gatha prabhutvam modini adiginattu laaga vundhi….
జనాలకి పంగనామాలు కాదు .. జనాలే పంగనామాలు పెట్టి దించేశారు రీసెంట్ గ ..