కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి.

త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి కాచుక్కూచున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పిన నేప‌థ్యంలో, అదే నిజ‌మ‌వుతుందా? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. కేటీఆర్ దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు డిస్మిస్ చేయ‌డంతో కింక‌ర్త‌వ్యం ఏంటి? అని ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ, అటు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అవినీతి జ‌రిగింద‌ని కేటీఆర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిపై ఏసీబీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ప్ప‌టికీ, ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. ఏసీబీ విచార‌ణ‌లో తాము జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు తేల్చి చెప్ప‌డంతో, కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌ద‌నే మాట వినిపిస్తోంది.

మ‌రోవైపు కేటీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. హైకోర్టులో కేటీఆర్‌కు షాక్ త‌గ‌ల‌డంతో, కేసు విష‌య‌మే ఎలా ముందుకెళ్లాల‌నే అంశంపై న్యాయ నిపుణుల‌తో బీఆర్ఎస్ సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని బీఆర్ఎస్ గ‌ట్టి వాద‌న వినిపిస్తోంది. అరెస్ట్ నుంచి ఉప‌శ‌మ‌నం కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని కేటీఆర్ త‌న న్యాయ‌వాదుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని తెలిసింది.

తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. ఎత్తులు, పైఎత్తుల‌తో అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రాజ‌కీయ పావులు క‌దుపుతున్నాయి.

3 Replies to “కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?”

  1. కెసిఆర్ రేవంత్ రెడ్డిని 2 సార్లు జైలు లో పంపించాడు .

    కెసిఆర్ ని , కేటీర్ ని కనీసం ఒక్క సారి అయిన జైలు కి పంపించకుండ ఉంటాడా రేవంత్ రెడ్డి ?

Comments are closed.