ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

ఈసారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రయిలర్స్ పరంగా చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో?

సంక్రాంతి బరిలో నిలిచిన 3 సినిమాల నుంచి 3 ట్రయిలర్స్ వచ్చేశాయి. ట్రయిలర్స్ తో సినిమాలపై ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక మిగిలింది ముక్కోణపు పోటీ మాత్రమే.

గేమ్ ఛేంజర్ ట్రయిలర్.. నిజాయితీ గల అధికారి, అవినీతి రాజకీయ నాయకుడి మధ్య పోరు. మధ్యలో తల్లి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్. ఇది కాకుండా భారీ ఫైట్లు, పాటలు, సెట్లు లాంటి అదనపు హంగులు.

డాకు మహారాజ్ ట్రయిలర్.. బాలయ్య మార్క్ ట్రయిలర్ కాదిది. భారీ డైలాగ్స్, అరుపుల్లేవు. అంతా సెటిల్ గా ఉంది. అండర్ ప్లే చేసే హీరో పాత్ర ఉంది. జనాల్ని హింసించే క్రూరమైన విలన్ ఉన్నాడు. విలన్ బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హీరోయిన్ ఉంది. కథ చాలా పెద్దదనే ఫీలింగ్.

సంక్రాంతికి వస్తున్నాం.. తాజాగా వచ్చిన ట్రయిలర్ ఇది. పూర్తిగా ఫన్. కొంచెం యాక్షన్, ఇంకొంచెం సెంటిమెంట్ మిక్స్ చేశారు. మిగతా 2 సినిమాలతో పోలిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రయిలర్ లోనే కథ మొత్తం చెప్పేశారు. వెంకీ మార్కు చమక్కులు, అనీల్ రావిపూడి మార్క్ ఫన్ పక్కా అంటున్నారు.

ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన 3 సినిమాల ట్రయిలర్స్ వచ్చేశాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కారు నుంచి టికెట్ రేట్ల పెంపుపై అనుమతులు కూడా తెచ్చుకున్నారు. దిల్ రాజు చొరవతో థియేటర్లు కూడా పంచుకున్నారు. ఇక మిగిలింది సినిమా రిజల్ట్ మాత్రమే.

భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఏమాత్రం బాగున్నా సంక్రాంతి బరిలో ప్రేక్షకులు వాటిని ఆదరించారు. యావరేజ్ కంటెంట్ తో వచ్చిన సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో హిట్టయిన సందర్భాలున్నాయి. మరీ తీసికట్టుగా ఉంటే మాత్రం తీసి పక్కనపెట్టారు.

ఈసారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రయిలర్స్ పరంగా చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక అనుమతులు మాత్రమే పెండింగ్. అది తప్ప ఆల్ సెట్.

4 Replies to “ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్”

  1. వెంకటేష్, సంక్రాతి కి ఎవరన్నా కొంచెం నవ్వుకొని సినిమా చూస్తారు.

  2. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

Comments are closed.