పుష్ప-2.. ఇక మిగిలింది అదొక్కటే

ఎర్రచందనంతో వాళ్లకు కనెక్షన్ ఉంది. కాబట్టి పుష్ప-2 చైనాలో పెద్ద హిట్టవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా ఎంత సాధించాలో అంతకంటే ఎక్కువే సాధించిందని చెప్పాలి. హిందీలో నంబర్ వన్ మూవీగా అవతరించడమే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది పుష్ప-2. ఇప్పుడీ సినిమా ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే.

ఇండియాలో వసూళ్ల పరంగా నంబర్ వన్ సినిమా పుష్ప-2 సినిమానే. బాహుబలి-2 వెనక్కు వెళ్లిపోయింది. అయితే ప్రపంచవ్యాప్త వసూళ్ల పరంగా చూసుకుంటే ఇండియన్ సినిమాల్లో నంబర్ వన్ మూవీ దంగల్. దీనికి ఓ కారణం ఉంది.

వరల్డ్ వైడ్ గ్రాస్ లో నంబర్ వన్ ఇండియన్ సినిమాగా దంగల్ నిలవడానికి కారణం చైనా బాక్సాఫీస్. చైనాలో దంగల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. వసూళ్ల వరద పారించింది. అందుకే ప్రపంచవ్యాప్త వసూళ్లలో దంగల్ నంబర్ వన్ గా నిలిచింది.

ఇప్పుడు పుష్ప-2 టార్గెట్ ఇదే. బన్నీ సినిమా ఇంకా చైనాలో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా చైనా బాక్సాఫీస్ లోకి వస్తే తప్పనిసరిగా దంగల్ ను క్రాస్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఎందుకంటే, చైనాలో ఎర్రచందనాన్ని పవిత్రంగా భావిస్తారు. ఎర్రచందనంతో వాళ్లకు కనెక్షన్ ఉంది. కాబట్టి పుష్ప-2 చైనాలో పెద్ద హిట్టవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

వీళ్ల నమ్మకానికి మరో కారణం కూడా ఉంది. ఈమధ్య చైనాలో భారతీయ సినిమాలు కొన్ని బాగా ఆడుతున్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్లో మహారాజ మూవీ పెద్ద హిట్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఆ సినిమా చూసి చైనీయులు ఫిదా అవుతున్నారు. క్లయిమాక్స్ కు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

సో.. ఇదే ఊపులో పుష్ప-2 కూడా చైనాలో రిలీజ్ అయితే, వరల్డ్ వైడ్ గ్రాస్ లో నంబర్ వన్ మూవీగా నిలవడం పెద్ద సమస్య కాదంటున్నారు. కానీ చైనా రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. దానికింకా టైమ్ పడుతుంది. ఎందుకంటే, ఇండియా సినిమాల్ని చైనాలో కోటా పద్ధతిన విడుదల చేస్తారు.

13 Replies to “పుష్ప-2.. ఇక మిగిలింది అదొక్కటే”

  1. ఎర్రచందనం పవిత్రం కాబట్టి ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం అపవిత్రం అని భావిస్తే 🤣

  2. చైనా కలెక్షన్లు అన్నీ మనీ లాండరింగ్. ఇప్పుడు ఆ రొచ్చు లోకి అల్లు అర్జున్ దిగాడు. రేవంత్ తో గొడవ ఉంది కాబట్టి, బీజేపీ సపోర్ట్ అవసరం.

    1. idhe allu arjun 2019 dhaaka Industry hit kooda padaledhu…. 5 years lo lekkalu maarayi…. next 5 years lekkalu mallee maarochu….nothing is permanent…. Life long success streak undadhu…. kaani Life long mega star sthaanam permanent….. Mega star & Power star are beyond numbers….. Pradhana manthri kooda respect isthaadu vallaki….

  3. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

Comments are closed.