న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!

ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేయ‌డంతో సీఐడీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది.

ముంబ‌య్ న‌టి కాదంబ‌రి జ‌త్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని ఏసీపీ హ‌నుమంతురావు, సీఐ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రుల‌కు ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.

జెత్వానీ కేసు డైలీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసు న‌మోదు కంటే ముందే, ముంబ‌య్ వెళ్లి జెత్వానీని అదుపులోకి తీసుకుని వేధించిన‌ట్టు సీఐడీ అధికారుల వాద‌న‌. కూట‌మి ప్ర‌భుత్వం జెత్వానీని అడ్డు పెట్టుకుని, వైసీపీ ప్ర‌భుత్వ అనుకూలుర‌నే కార‌ణంతో నాటి నిఘా అధిప‌తి ఆంజ‌నేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని త‌దిత‌ర ఐపీఎస్ అధికారుల‌పై కేసు పెట్టింద‌నే ఆరోప‌ణ లేకపోలేదు. మ‌రోవైపు గ‌త ప్ర‌భుత్వం వివిధ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఏబీవీ లాంటి వారిపై వాటిని ఎత్తి వేశార‌నే చ‌ర్చ కూడా వుంది.

ఈ నేప‌థ్యంలో సీఐడీ త‌మ‌పై న‌మోదు చేసిన కేసుల్ని స‌వాల్ చేస్తూ, ఐపీఎస్ అధికారుల‌తో పాటు ఇత‌ర అధికారులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేయ‌డంతో సీఐడీకి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది.

ఇదిలా వుండ‌గా ఈ కేసులో నిందితుల‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు కావ‌డంపై సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాది అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని న్యాయ‌వాది తెలిపారు.

6 Replies to “న‌టి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీకి హైకోర్టు షాక్‌!”

  1. నందిగం సురేష్ కి సుప్రీం కోర్ట్ షాక్ గురించి రాయకపోతివి?

  2. Then it’s perhaps kamambari..

    same idi kuda kakinada dry east laa tide..

    just in disguise of her, current govt wants to harass some officers who doesn’t listen to them.

Comments are closed.