ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గత కొంత కాలంగా కనిపించీ, కనిపించకుండా ఉన్నారు. ఎందుకనో ఆమె గతంలో మాదిరి యాక్టీవ్‌గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు ఎక్స్‌లో పోస్టులు పెట్టడం మినహా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా లేవు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌పై విమర్శలు తగ్గించారనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
అసలు షర్మిలను కట్టడి చేస్తున్నదెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందనే అనుమానం తలెత్తింది. షర్మిల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కూటమి రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల పని చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు సైతం బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
ఇవాళ షర్మిల ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆమె ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటమంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర షర్మిల విమర్శించారు. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని.. వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని షర్మిల గుర్తు చేశారు.
షర్మిల ఊరికే మౌనం పాటించరని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింతలేవో పడ్డట్టున్నాయనే అభిప్రాయం లేకపోలేదు. ఇప్పటికే షర్మిల ఏకపక్ష ధోరణిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
మన anniyya party ని కాంగ్రెస్ లో కలిపేసె time వచ్చేసింది అని HINT ఇస్తున్నావా GA 😂😂😂
Ante langa leven Charitra ye antava