ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!

ఫ‌ర్మామెన్స్ స‌ర్టిఫికెట్ల‌ను ఎంఈవోల నుంచి తెచ్చుకోవ‌డం సులువ‌ని, ఇలాంటివ‌న్నీ వృథా ప్ర‌యాస‌గా ఉపాధ్యాయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయుల పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా కూట‌మి స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఆరు నెల‌ల కూట‌మి పాల‌న‌ల‌పై అప్పుడే ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. తాజాగా ఉపాధ్యాయుల ప‌నితీరుకు పాయింట్లు ఇచ్చే ఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం వుంది. ఇది ఉపాధ్యాయుల‌కు ప్రోత్సాహ‌మ‌ని టీడీపీ అనుకూల మీడియా వాదిస్తోంది.

అయితే ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతోంద‌నే ఆరా తీయగా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన వేత‌నం ఇస్తే చాలు అనుకునే సంతృప్తి స్థాయికి ఉపాధ్యాయులు ప‌రిమితం చేసేందుకే ఇలాంటి జిమ్మిక్కుల్ని ప్ర‌భుత్వం చేస్తోంద‌నే చ‌ర్చ వాళ్ల గ్రూపుల్లో జ‌రుగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనే ఉపాధ్యాయుల ఫ‌ర్మామెన్స్‌కు పాయింట్స్ ఇచ్చేందుకు నిర్ణ‌యించార‌ని, దానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మించి, ర‌ద్దు చేయించ‌డాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు.

ఫ‌ర్మామెన్స్ స‌ర్టిఫికెట్ల‌ను ఎంఈవోల నుంచి తెచ్చుకోవ‌డం సులువ‌ని, ఇలాంటివ‌న్నీ వృథా ప్ర‌యాస‌గా ఉపాధ్యాయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డ‌గానే రెండు డీఏలు, 27 శాతం ఐఆర్ ఇస్తార‌ని ఆశించామ‌ని, అవేవీ ఇవ్వ‌క‌పోగా, క‌నీసం ఒక‌టో తేదీన జీతాలు వేయ‌లేని దుస్థితి ఏర్ప‌డింద‌ని ఉపాధ్యాయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

త‌మ హ‌క్కుల విష‌య‌మై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌కుండా, ఫ‌ర్మామెన్స్ పాయింట్స్‌, అలాగే ఒక‌టో తేదీన జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం తెర‌పైకి తెస్తోంద‌ని ఉపాధ్యాయ సోష‌ల్ మీడియా గ్రూపుల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం ఆస‌క్తిక‌ర అంశం.

17 Replies to “ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఇదీ చ‌ర్చ‌!”

    1. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు..

      కష్టపడితే సుఖపడతారు… అది టీచర్లయినా, మరే ఉద్యోగులయినా.. .. సింపుల్..

      అది మన కుటుంబానికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచిది..

      ..

      6 నెలల్లో వ్యతిరేకత అనేది ఒట్టి మాట.. ఏ ప్రభుత్వమైనా ప్రజలు 5 ఏళ్ళు భరించాల్సిందే.. అప్పుడే వ్యతిరేకత అని ఊగిపోయి లాభం లేదు.. ఆ మాట కూడా అనుకోరు..

      జగన్ రెడ్డి కి అతని వందమాగధులకు ప్రభుత్వ వ్యతిరేకత అని ఎక్కించడం ఒకటే స్ట్రాటజీ..

      ..

      నేను ఇండియా లో లేను.. గత డిసెంబర్ లో శబరిమల కోసం ఇండియా వచ్చాను.. ఉన్న వారం రోజుల్లో వ్యతిరేకత అనే మాట అనవసరం..

  1. ఏ? ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే పెర్ఫార్మన్స్ రివ్యూ ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగులకు ఉండకూడదా? ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే జీవితాంతం పని చేయకుండా బ్రతికేయొచ్చా? ప్రతి సంవత్సరం చేసిన పని రివ్యూ చేసి, సరిగ్గా చేయకపోతే ఉద్యోగం తీసేసే రూల్స్ రావాలి. అలాంటప్పుడే ప్రైవేట్ ఉద్యోగులు పని చేసే విధంగా గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తారు.

    తేరగా తిని కూర్చోవడానికి గవర్నమెంట్ కి డబ్బులు ఊరికే రావట్లే. టాక్స్ పేయర్స్ మనీ అది. తింటున్న ప్రతీ రూపాయి కి ఒళ్ళు వంచి పని చేయాల్సిందే. కాదంటావా? అయితే గవర్నమెంట్ ఉద్యోగులకి కి ప్రతి నెలా నువ్వు పంపు డబ్బులు.

  2. ఆ వర్గం ఈ వర్గం అని ఎందుకొచ్చిన తంతా ఇది .. 29 లో 175/175 మావే అని రాసుకోండి .. పోయింది ఏముంది ..

      1. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా అనుకోండి 175/175 అన్నారు .. 30 ఇయర్స్ నేనే అనుకున్నారు .. అనుకున్నవి అన్నీ అవ్వవు కదా..

  3. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

Comments are closed.