ఆయుధ పూజ స్పెషల్.. టాలీవుడ్ లో వెపన్స్

దసరా పోస్టర్లు వచ్చేశాయి. మరీ ముఖ్యంగా ఈసారి టాలీవుడ్ లో 'ఆయుధ పూజ' స్పెషల్ కనిపించింది. ఓవైపు ప్రభాస్ పుట్టినరోజు, మరోవైపు దసరా. దీంతో ఆయుధ పూజ స్పెషల్ అంటూ సలార్ నుంచి కొత్త…

దసరా పోస్టర్లు వచ్చేశాయి. మరీ ముఖ్యంగా ఈసారి టాలీవుడ్ లో 'ఆయుధ పూజ' స్పెషల్ కనిపించింది. ఓవైపు ప్రభాస్ పుట్టినరోజు, మరోవైపు దసరా. దీంతో ఆయుధ పూజ స్పెషల్ అంటూ సలార్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. సినిమాలో వాడిన ఆయుధాలతో ఓ పోస్టర్ వదిలారు.

దేవర-1 నుంచి కూడా 'ఆయుధ పూజ' స్పెషల్ వచ్చేసింది. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెపన్ ను విడుదల చేశారు. ఇందులో తారక్ లుక్ లాంటిదేం లేదు. కేవలం కొత్త ఆయుధాన్ని పరిచయం చేశారంతే. సినిమాలో ఓ రేంజ్ లో యాక్షన్ ఉండబోతోందనే విషయాన్ని మరోసారి నొక్కిచెప్పారు ఈరోజు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా 'ఆయుధ పూజ' స్పెషల్ వచ్చేసింది. ఖాకీ డ్రెస్సులో లాఠీ పట్టుకోవడం, తుపాకి పట్టుకోవడం రొటీన్ అనుకున్నాడేమో.. ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్ చేతికి పెద్ద సుత్తి అందించాడు దర్శకుడు హరీశ్ శంకర్. దానిపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అదే దసరా స్పెషల్ పోస్టర్.

ఓజీ నుంచి కూడా స్పెషల్ పోస్టర్ వచ్చింది. అయితే వాళ్లు ప్రత్యేకంగా ఆయుధాలు పరిచయం చేయలేదు. ఆల్రెడీ పవన్ చేతిలో కత్తి, తుపాకీ పట్టుకున్న పోస్టర్లు, విజువల్స్ వచ్చేశాయి. ఈసారి కేవలం పవన్ తీక్షణంగా చూస్తున్న పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. “అతడి చూపు, ఎన్నో ఆయుధాల కంటే పదును” అనేది క్యాప్షన్.

నాని కొత్త సినిమా 'సరిపోదా శనివారం', సుధీర్ బాబు మూవీ హరోంహర నుంచి కూడా ఆయుధాలు బయటకొచ్చాయి. 'సరిపోదా శనివారం' వీడియోలో కత్తిపీటతో కనిపించాడు నాని. ఇక హరోంహర లో శూలం పట్టుకున్న సుధీర్ బాబును చూపించారు. ఇలా ఈ దసరాకు టాలీవుడ్ నుంచి చాలా ఆయుధాలు బయటకొచ్చాయి.