కొత్త మలుపు తిరిగిన ‘పాడుతా తీయగా’

పాడుతా తీయగాలో తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని వాళ్లు, మీడియా చూసుకుంటుంది. కానీ మీరు కీరవాణిపై వ్యక్తిగతంగా అలా మాట్లాడ్డం ఎంతవరకు కరక్టో ఓసారి ఆలోచించండి.

‘పాడుతా తీయగా’ వివాదం గురించి చాలామందికి తెలిసిందే. గాయని ప్రవస్తి, ఆ కార్యక్రమం జడ్జీలైన కీరవాణి, చంద్రబోస్, సునీత పై ఆరోపణలు చేశారు. మరీ ముఖ్యంగా సునీత, కీరవాణిపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ప్రవస్తి కామెంట్స్ పై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొంతమంది ఆమెకు మద్దతిస్తే, లిప్సిక, హారిక నారాయణ్ లాంటి మరికొంతమంది కీరవాణిని వెనకేసుకొచ్చారు.

ఇప్పుడీ మొత్తం వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. దర్శకుడు గీతాకృష్ణ, కీరవాణిపై ఊహించని ఆరోపణలు చేశారు. యూట్యూబ్ లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన ఈ డైరక్టర్, కీరవాణి తన దగ్గరకు స్కూల్ గర్ల్స్ ను తీసుకురమ్మంటారంటూ అతిపెద్ద ఆరోపణ చేశారు.

తనకు ఈ విషయం బాగా తెలుసని, కీరవాణిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేయడం విడ్డూరం. గీతాకృష్ణ చేసిన సంచలన ఆరోపణలపై సంగీత దర్శకుడు కోటి స్పందించారు.

“పాడుతా తీయగాలో తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని వాళ్లు, మీడియా చూసుకుంటుంది. కానీ మీరు కీరవాణిపై వ్యక్తిగతంగా అలా మాట్లాడ్డం ఎంతవరకు కరక్టో ఓసారి ఆలోచించండి. ఏ కార్యక్రమం చేసినా చిన్నచిన్న తప్పులు దొర్లుతాయి. వాటిపై మీరు ఇంత రచ్చ చేయడం నాకు చాలా బాధగా ఉంది.”

కీరవాణి, సునీత ఎంతో కష్టపడి పైకొచ్చారని, అలాంటి వ్యక్తులపై గీతాకృష్ణ మాట్లాడుతుంటే భయంతో పాటు బాధేస్తోందని, ఇకపై అలాంటి కామెంట్స్ ఆపేయాలని గీతాకృష్ణను కోరారు కోటి.

గీతాకృష్ణ, కోటి ఎపిసోడ్ తో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గీతాకృష్ణపై లీగల్ గా చర్యలు తీసుకునేందుకు రాజమౌళి కుటుంబ సభ్యులు సన్నద్ధమౌతున్నట్టు వార్తలొస్తున్నాయి.

11 Replies to “కొత్త మలుపు తిరిగిన ‘పాడుతా తీయగా’”

  1. Ee geetha krishna bathuku theruvu you tube lo ..sexual comments chesi..andhari meeda cheap ga matladathadu.

    eedoka cheep stake.

    you tube lo baseless comments chesthadu.

    eediki posani gathi paduthundhi.

  2. RRR “కొమ్మా ఉయ్యాలా” లాంటి పాట పాడటానికి లేత వాయిస్ ఉండే స్కూల్ గర్ల్స్ అయితే బాగుంటుంది అంటే, ఈడు దాన్ని వక్రీకరించి ఏదేదో వాగితే నమ్మడానికి ఎలా కనిపిస్తున్నారు ??

  3. పేరులోనే ‘పాడు’ ఉంది, ఇంకా కొత్తగా ఏముంటుందని ఊహించాలి?

    ఇది టాలీవుడ్లో మీటు ఉద్యమానికి నాంది పలికి ఎంత మంది బండారాలు బయటపెడుతుందో చూడాలి

  4. గీతాకృష్ణకి మానసిక స్థిమితం లేదు. అతడి మాటకి విలువ లేదు , యూట్యూబ్ లో వచ్చే చిల్లర పైసలకోసం ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. అతడు జీవితంలో కీరవాణి ఆఫీసులోకి అడుగుపెట్టి ఉండడు.

  5. గీతాకృష్ణ అందరి గురించి అతి నీచంగా మాట్లాడతాడు!

    మొన్నవడొ జగన్ సతీమని గురించి కూడా ఎదొ వాగాడు! ఇలాంటి వారి మాటలకి ఎదొ విశ్వసనీయత ఉన్నట్టు… వాటిని రాస్తూ, ప్రచారం కల్పిస్తె .. అది మన నీచ బుద్ది గురించె చెపుతుంది!

Comments are closed.