కొలికపూడిపై ఆగ్రహమేనా… వేటు లేదా?

కొలికపూడి విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, రానున్న రోజుల్లో మరెంత మంది బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుందో

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంలో ఇరుక్కున్నప్పుడల్లా… ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, నివేదిక అడిగారనే కధనాలు టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్నాయి. గతంలో కొలికపూడి వైఖరితో టీడీపీ నాయకుడి భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా వైసీపీకి చెందిన వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

కొలికపూడి తీరుతోనే సదరు మహిళ బలవన్మరణానికి ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. కొలికపూడి తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడుతున్నారని, ఆయన ఏం చేశారో వెంటనే నివేదిక తెప్పించాలంటూ పార్టీ నాయకులను ఆదేశించడం విశేషం.

ఏదో ఒక కారణంతో కొలికపూడి వివాదంలో ఉండడం, సీఎం ఆగ్రహించారనడం తప్ప, పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శ టీడీపీ నేతల నుండి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడేలా కొలికపూడి దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా, ప్రభుత్వం ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న చర్చకు తెరలేపింది.

మహిళలను వేధిస్తే తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని హెచ్చరికలు చేసే పవన్ కల్యాణ్, తాజాగా కొలికపూడి వ్యవహారంపై ఏమంటారనే ప్రశ్న ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కావడంతో, జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొలికపూడి విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, రానున్న రోజుల్లో మరెంత మంది బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తుందో అని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నట్లు చర్చనీయాంశమవుతోంది.

10 Replies to “కొలికపూడిపై ఆగ్రహమేనా… వేటు లేదా?”

  1. TV లలో డిబేట్ లు చేసినంత వీజీ కాదు రాజకీయాలు చెయ్యటం అంటే. ఇతను షార్ట్ టెంపర్ లా వున్నాడు.. మాటలు..చేతులు ఏవీ అదుపులో లేవు. పదే పదే ఆరోపణలు.. ఎవరితో ఎలా డీల్ చెయ్యాలో ..ఎంతవరకు వుండాలో తెలియకుండా ప్రజాప్రతినిధులు అనిపించుకోరు.పార్టీ పరువు ని బజారు కీడుస్తున్నాడు..పూర్తిగా బట్టలు విప్పేలోపు ఇతని మీద సీబీన్ గారు ఏక్షన్ తీసుకోవాలి.నాన్చుడు ధోరణి తో కార్యకర్తలు కి అసహనం,విసుగు పుట్టించకండి. ఇలాంటి లం…జ సైట్ ల ద్వారా మా తో పార్టీ గురుంచి ఇలా కామెంట్స్ చేసే పరిస్థితి తీసుకు రాకండి!

    1. ఇలాంటి లన్… జ సైట్ లో ఇరవై నాలుగు గంటలు పడి ఉండి వేళ్ళు దూర్చే నువ్వు ఏంటి బ్రో..

  2. అయ్యా! అదెంటి బాబయి హత్య లొ ఉన్న అందరూ ఒక్కొరుగా చనిపొతున్నారు! అది ఎలానొ చెప్పు!

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. కేవలం మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని గుండుకొట్టించి ఆత్మహత్య చేసుకునేలా చేసినప్పుడు, మా “లెవెన్ మోహన రెడ్డి” లైటింగ్ స్పీడ్ లో నిందితుడి తోలు వొలిచి చెప్పులు కుట్టించుకున్నాడు తెలుసా ??

Comments are closed.