మంచు మ‌నోజ్‌ను అడుగు పెట్ట‌నివ్వ‌లేదు!

సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు కాలేజీలోకి ఆయ‌న చిన్న కుమారుడు మ‌నోజ్‌ను అడుగు పెట్ట‌నివ్వ‌లేదు.

సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు కాలేజీలోకి ఆయ‌న చిన్న కుమారుడు మ‌నోజ్‌ను అడుగు పెట్ట‌నివ్వ‌లేదు. ఈ మేర‌కు పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కొంతకాలంగా మోహ‌న్‌బాబు కుటుంబంలో వివాదాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న కాలేజీలోకి చిన్న కుమారుడైన మ‌నోజ్ రావ‌ద్దంటూ కోర్టులో మోహ‌న్‌బాబు ఇంజెక్ష‌న్ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిష‌న్‌పై న్యాయ స్థానం మోహ‌న్‌బాబుకు అనుకూలంగా స్పందించింది. మ‌రోవైపు ఇవాళ మ‌నోజ్ రంగంపేటలోని కాలేజీ వ‌ద్ద‌కెళ్లారు. లోప‌ల మోహ‌న్‌బాబు, ఆయ‌న పెద్ద కుమారుడు మంచు విష్ణు రెండు రోజులుగా ఉన్నారు. సంక్రాంతి సంబ‌రాలు చేసుకుంటున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షమైన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇవాళ కాలేజీకి మ‌నోజ్, ఆయ‌న భార్య మౌనిక‌ వ‌స్తున్నార‌నే స‌మాచారంతో ఉత్కంఠ రేగింది. కాలేజీ సెక్యూరిటీ అప్ర‌మ‌త్తం అయ్యారు. అలాగే అక్క‌డికి పోలీసులు కూడా చేరుకున్నారు. కాలేజీలోప‌లికి వెళ్లేందుకు నాలుగు గేట్ల వ‌ద్ద‌కు మ‌నోజ్ దంప‌తులు వెళ్లి ప్ర‌య‌త్నించారు. పోలీసుల‌తో చ‌ర్చించారు.

అయితే కాలేజీలోకి అనుమ‌తించొద్ద‌ని, ఇందుకు సంబంధించి కోర్టు నుంచి మోహ‌న్‌బాబు తెచ్చుకున్న ఆదేశాల్ని మ‌నోజ్‌కు పోలీసులు చూపించారు. లోప‌లికి వెళితే శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య ఏర్ప‌డే ప్ర‌మాదం వుంద‌ని మ‌నోజ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లోప‌లికి అనుమ‌తించేది లేద‌ని మ‌నోజ్‌కు పోలీసులు తేల్చి చెప్పారు.

దీంతో మ‌నోజ్ చేసేదేమీ లేక భార్య మౌనిక‌తో క‌లిసి స‌మీపంలోని నారావారిప‌ల్లెకు వెళ్లారు. అక్క‌డే ఉన్న మంత్రి నారా లోకేశ్‌ను మ‌నోజ్ దంప‌తులు క‌లుసుకున్నారు. భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. భూమా అఖిల‌ప్రియ ప్ర‌స్తుతం ఆళ్ల‌గ‌డ్డ సిటింగ్ ఎమ్మెల్యే కూడా.

6 Replies to “మంచు మ‌నోజ్‌ను అడుగు పెట్ట‌నివ్వ‌లేదు!”

  1. ఇది మోహన్ బాబు గారి కుటుంబ సమస్యలు. వీటిలో ఏపార్టీ తలదూర్చినా ఆ పార్టీ పరువు పోతుంతుంది. ప్రతీ ఇంటిలో వుండే సమస్యలే. దీనికి పచ్చ మీడియా అత్యుచాహం చూపిస్తే అంతకన్నా సిగ్గులేని పని మరొకటి లేదు.

      1. బులుగు మీడియా కి సిగ్గు లేదు కాబట్టి.. వాళ్ళు అన్నిట్లో తల దూర్చొచ్చు.. అని కవి భావం..

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. GA అన్నయ్యా అది ఇంజెక్షన్ కాదు ఇంజంక్షన్ ( తెలుగు అప్రాక్సిమేషన్ ఫర్ injunction)

Comments are closed.