మొత్తానికి మంచు మనోజ్ తను అనుకున్నది సాధించాడు. మోహన్ బాబు యూనివర్సిటీలోకి పూర్తిగా కాకపోయినా, పాక్షికంగా అడుగుపెట్టాడు. యూనివర్సిటికీ ఆనుకొని ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ సమాధుల్ని దర్శించి, నివాళులు అర్పించాడు.
ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా నడిచింది. మనోజ్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న మోహన్ బాబు, మంచు విష్ణు.. యూనివర్సిటీకి చెందిన గేట్లు అన్నీ మూసేశారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారమిచ్చారు.
బౌన్సర్లతో వచ్చిన మంచు మనోజ్, లోపలకు వెళ్లే ప్రయత్నం చేశాడు. 4 గేట్ల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఏ ఒక్క గేటు నుంచి మనోజ్ ను అనుమతించలేదు. ఒక దశలో మనోజ్ కు చెందిన బౌన్సర్లకు, మంచు విష్ణు బౌన్సర్లకు కొట్లాట జరగ్గా, మరోవైపు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
బయట గొడవ జరుగుతుంటే, మంచు మోహన్ బాబు, విష్ణు యూనివర్సిటీ లోపలే ఉన్నారు. సంక్రాంతి సంబరాల కోసం 2 రోజుల కిందటే వాళ్లు వచ్చారు. ఇప్పుడు మనోజ్ రాకతో వాళ్లు కాస్త టెన్షన్ పడ్డారు.
కోర్టు ఆర్డర్ ఉండడంతో మనోజ్ లోపలకు వెళ్లలేకపోయాడు. ఆర్డర్ జిరాక్స్ కాపీని మనోజ్ కు స్పాట్ లో అందించారు. కోర్టు ఆర్డర్ కాపీ అందుకున్న మనోజ్, ఫోన్ లోనే పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడాడు. కనుమ రోజున ఆనవాయితీ ప్రకారం, తన తాతయ్య-నాన్నమ్మల సమాధుల్ని సందర్శిస్తానని, తనకు ఆ హక్కు ఉందని అన్నాడు.
దీంతో కేవలం మనోజ్-మౌనికను సమాధుల వరకు మాత్రమే లోపలకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్లతో పాటు పోలీసులు కూడా వెళ్లారు. అలా సమాధుల్ని దర్శించి తను అనుకున్నది సాధించాడు మనోజ్. ఈ గ్యాప్ లో నారావారిపల్లె వెళ్లి నారా లోకేష్ ను కలిశాడు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
లోకేశ్ నీ కలిసే బదులు పవన్ నీ కలువు… నీకు న్యాయం జరుగుతుంది… లోకేష్ తో బొంగు ఉపయోగం లేదు.. బాబు పోతే పవన్ సిఎం
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు