నారప్ప తరువాత విశ్రాంతి

సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూట్ లో బిజీగా వున్నారు. ఈ సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. ఈ సినిమా తరువాత వెంకీ సినిమా ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ…

సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూట్ లో బిజీగా వున్నారు. ఈ సినిమా దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. ఈ సినిమా తరువాత వెంకీ సినిమా ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. 

డైరక్టర్లు, కథలు ఏవీ రెడీగా లేవు. నిర్మాతలు అప్రోచ్ అవుతున్నారు కానీ, సరైన సబ్జెక్ట్ దొరికే వరకు వేచి వుండాలని వెంకటేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

నారప్ప సినిమా తరువాత వెంకీ కాస్త గ్యాప్ తీసుకుని, రెస్ట్ తీసుకుంటారని, ఆ తరువాతే ఏ ప్రాజెక్టు, ఎవరితో అన్నది ఆలోచిస్తారని తెలుస్తోంది. 

సతీష్ వేగ్నిశ ఓ మాంచి లైన్ ను రానా-వెంకీ కాంబినేషన్ కోసం చెప్పాలని సురేష్ బాబు వెల్లడించారు. కానీ ఈ సినిమా అంత వీజీ కాదు. ఎందుకంటే రానా చేతిలో రెండు మూడు కమిట్ మెంట్లు వున్నాయి. అవి పూర్తి చేసేసరికే ఏడాది పడుతుంది. 

బహుశా అంత వరకు వెంకీ విశ్రాంతి తీసుకుంటారా? లేక, దృశ్యం, గురు, నారప్ప ఇలా సరైన రీమేక్ దొరికే వరకు రెస్ట్ లో వుంటారా? అన్నది తెలియాల్సి వుంది.

ఇళ్ల పట్టాలు నిరంతర ప్రక్రియ