పవర్ ప్యాక్డ్ ‘రెడ్’

ఇస్మార్ట్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ రెడ్ ట్రయిలర్ వచ్చేసింది. ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అన్ని విధాలా రెడీ అయి చాలా కాలం అయింది. కానీ కరోనా కారణంగా వెయింటింగ్ లో వుండిపోయింది. …

ఇస్మార్ట్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ రెడ్ ట్రయిలర్ వచ్చేసింది. ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అన్ని విధాలా రెడీ అయి చాలా కాలం అయింది. కానీ కరోనా కారణంగా వెయింటింగ్ లో వుండిపోయింది. 

ఎప్పుడయినా థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ఓటిటికి ఇవ్వకుండా వుంచేసారు. థియేటర్లు తెరుచుకోవడంతో సంక్రాంతికి విడుదల దిశగా వెళ్తోంది. తిరుమల కిషోర్ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.

ట్రయిలర్ మీద ఇస్మార్ట్ శంకర్ ప్రభావం కొంత కనిపిస్తోంది. రామ్ లో జనాలకు నచ్చిన ఆ రఫ్ మాస్ యాంగిల్ ను బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసారు. అదే టైమ్ లో కథలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను ట్రయిలర్ లో ప్రెజెంట్ చేసి, ఆసక్తి రేకెత్తించే ప్రయత్నమూ చేసారు. 

రామ్ డబుల్ రోల్..ఒకటే లుక్ జస్ట్ డ్రెస్ ఛేంజ్ అన్నవి కాస్త ఆసక్తి కలిగించేలా వున్నాయి. మొత్తానికి సంక్రాంతి రేస్ కు రామ్ రెడ్ కూడా సరిపోయేలాగే కనిపిస్తోంది.