బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ గా నిలిచిన అభిజీత్.. పండగ చేస్తానంటున్నాడు. తనను గెలిపించిన ప్రేక్షకులను నేరుగా కలుస్తానంటున్నాడు. సక్సెస్ మీట్ కాదు.. ఏకంగా సక్సెస్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు ఈ విజేత.
“ఓ 10 రోజులు పండగ చేద్దాం అనుకుంటున్నాను. అందర్నీ కలవాలనుకుంటున్నాను. సక్సెస్ మీట్ మాత్రమే కాదు. రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చాలా టౌన్స్ తిరగాలనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కర్ని కలుస్తాను. దానికి ప్లాన్ రెడీ చేస్తున్నాం.”
సో.. త్వరలోనే అభిజీత్ చాలా టౌన్స్ లో ప్రత్యక్షం కాబోతున్నాడన్నమాట. ఇక గేమ్ విషయానికొస్తే.. ఆయన ఫిజికల్లీ ఫిట్ కాదన్నారు చాలామంది. చాలా టాస్కుల్లో వెనకడుగు వేశాడనే విమర్శ ఉంది. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై కూడా రియాక్ట్ అయ్యాడు అభిజీత్.
“నాకు ఫిజికల్లీ ఫిట్ నెస్ లేదన్నారు కొందరు. అసలు బిగ్ బాస్ హౌజ్ లో ఫిట్ నెట్ ఎంత వరకు అవసరం అని నేను ఆలోచించాను. టాస్క్ ఆడడం ఇంపార్టెంట్, ఎలా ఆడాలనేది ముఖ్యం. అది ఫిజికల్లీనా, మెంటల్లీనా అనేది మన ఇష్టం. టెన్నిస్, గోల్ఫ్, ఫుట్ బాల్ బాగా ఆడతాను. నాకు ఫిట్ నెస్ లేదని ఎలా అంటారు.”
సోహైల్ కు ఇవ్వడం కోసం తన ప్రైజ్ మనీకి కోత పెట్టారనే విమర్శపై అభిజీత్ స్పందించలేదు. ఎంత వచ్చిందనేది తనకు ఇంపార్టెంట్ కాదని, గెలిచామా లేదా అనేదే తనకు ముఖ్యమని చెబుతున్నాడు.
నిజంగా తనకు ప్రైజ్ మనీ తక్కువ వచ్చిందని ఆడియన్స్ భావిస్తే, ఆ విషయాన్ని స్టార్ మా చూసుకుంటుందని, తను మాత్రం రియాక్ట్ అవ్వనని అంటున్నాడు. డబ్బు అనేది రేపు ఖర్చయిపోతుందని, తను కోరుకున్న గుర్తుంపు వచ్చిందని, తనకు అది చాలంటున్నాడు అభిజీత్.