మహేష్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన తరువాత నుంచీ వంశీ పైడిపల్లి ని హీరో రామ్ చరణ్ ను జతచేయాలన్నది నిర్మాత దిల్ రాజు సంకల్పం. మార్చి నాటికి ఆచార్య సెట్ మీదకు వచ్చి మే కల్లా ఫ్రీ అయిపోతాడు రామ్ చరణ్. ఆ తరువాత ఏంటీ? అన్నది డిస్కషన్ లో వుంది.
అయితే వంశీ పైడిపల్లి సినిమా అయితే చేయడం లేదని, వేరే ఆలోచనలు సాగుతున్నాయని వినిపిస్తోంది. కచ్చితంగా ఓ సినిమాను యువి విక్కీ కోసం చేయాలని సంకల్పించుకుని వున్నాడు రామ్ చరణ్. అందుకోసం స్క్రిప్ట్, డైరక్టర్ కావాలి.
ఏప్రిల్ నాటికి ఆ రెండూ సెట్ అయితే ఆ సినిమానే వుంటుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఓటిటి వ్యవహారాల్లో బిజీగా వున్నారు.
ఎప్పటికైనా సెట్ అయితే మహేష్ తోనే సినిమా చేయాలనే ఆలోచనతో వున్నారని, ఆ మేరకు ఆయనకు హామీ కూడా వుందని తెలుస్తోంది.
అందువల్ల దిల్ రాజు-వంశీపైడిపల్లి-మహేష్ సినిమా ఎప్పటికైనా వుండే అవకాశం వుంది కానీ, రామ్ చరణ్ తో వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.