బాబు చేయలేని పని జగన్ చేశారు..!

కబుర్లు చెప్పడం, ఆర్భాటాలు చేయడమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు అని విమర్శలు ఉన్నాయి. తలచుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం అందరి కంటే బాబుకే ఎక్కువ ఉంది.  Advertisement ఆయన ఉమ్మడి ఏపీలో…

కబుర్లు చెప్పడం, ఆర్భాటాలు చేయడమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు అని విమర్శలు ఉన్నాయి. తలచుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం అందరి కంటే బాబుకే ఎక్కువ ఉంది. 

ఆయన ఉమ్మడి ఏపీలో దాదాపుగా తొమ్మిదేళ్ళు, విభజన ఏపీలో అయిదేళ్ళూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటువంటి బాబు హైదరాబాద్ చుట్టూనే తన ఆలోచనలు అన్నీ నాడు తిప్పారు, ఇక విభజన తరువాత అమరావతి అంటూ కలవరించారు. 

కానీ నాడూ నేడూ శ్రీకాకుళం జిల్లా అని ఒకటి ఉందని, అక్కడ ఉద్ధానం లో కిడ్నీ రోగులు ఉన్నారని, పాలకుల పాపాన్నే తమ శాపంగా చేసుకుని అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారని బాబుకు తెలుసో తెలియదో కూడా తెలియదు. అనుకూల మీడియా పతాక శీర్షికలకు ఆ చావు వార్తలు ఎపుడూ ఎక్కవు.

ఇక తమ బతుకులు మారవంతేననుకుని ఉద్ధానం కిడ్నీ బాధితులు జీవిస్తున్న వేళ ఒకే ఒక్కడుగా జగన్ చేసిన పాదయాత్ర వారికి ఊపిరిని ఇచ్చింది.  జగన్ వారి కష్టాలను చూసి నాడే హామీ ఇచ్చేశారు. అది నేడు సాకారం అయింది. 700 కోట్లతో ఉద్ధానాన్ని ఉద్ధరించడానికి జగన్ సర్కార్ కంకణం కట్టుకుంది.

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద హీరమండలం గొట్టా బ్యారేజి నుంచి  వంశధార నీటిని తీసుకొచ్చి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజలకు రక్షిత మంచినీరు అందినే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. 

దానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమాంత్రి ధరాన క్రిష్ణ దాస్ అయితే చరిత్రలో  ఇది గుర్తుండిపోయే రోజు అంటూ భావోద్వేగమయారు. దాదాపుగా 800 గ్రామలకు ఈ సురక్షితమైన  నీరు అందుతుంది. పరిశుధ్ధమైన తాగు నీటి సరఫరాతో కిడ్నీ రోగుల కష్టాలు ఇకపైన తీరనున్నాయి. మొత్తానికి బాబు చేయలేని పనిని జగన్ చేశాడని అంటున్నారు.

అభిజిత్ చాలా కేరింగ్ పర్సన్