నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పెద్ద ట్రబుల్ లోనే పడ్డట్టుగా ఉంది. ఇప్పుడు దేశం దాటలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది జాక్వెలిన్. 200 కోట్ల రూపాయల మొత్తం చీటింగ్, మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో బహుమతులను పొందడంతో జాక్వెలిన్ ఇక్కట్లను ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. అతడి నుంచి ఈమె సుమారు పది కోట్ల రూపాయల బహుమతులను పొందినట్టుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నివేదికలో పేర్కొంది.
ఈ క్రమంలో ఆమె నిన్న దుబాయ్ కు వెళ్లే ప్రయత్నం చేయడం, ఎయిర్ పోర్టులో భద్రతా సిబ్బంది ఆమెను అడ్డగించడం జరిగింది. ఆమె విదేశానికి వెళ్లడాని వీల్లేదంటూ వెనక్కు పంపేసినట్టుగా తెలుస్తోంది. ఇలా దేశం దాటే స్థితిలో లేనట్టుగా ఉంది జాక్వెలిన్.
వాస్తవానికి ఈమె జన్మతహః భారతీయురాలు కాదు. శ్రీలంకన్ కాబోలు. అంతర్జాతీయ స్థాయిలో, అందాల పోటీలో నెగ్గడం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో జాక్వెలిన్ ఇండియాలోనే ఉంటున్నట్టుంది. ఈ క్రమంలో ఇప్పుడు దేశం దాటడం కష్టం అయినట్టుగా ఉంది.
ఇప్పుడు జాక్వెలిన్ తనకు మద్దతును కోరుతోందట. ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నుంచి జాక్వెలిన్ సహయాన్ని అర్థిస్తున్నట్టుగా టాక్. సల్మాన్ తో పలు సినిమాల్లో నటించింది జాక్వెలిన్. ఆ మేరకు సాన్నిహిత్యం ఉందట. ఈ నేపథ్యంలో ఈ కష్టాల నుంచి బయటపడేయాలని సల్మాన్ వద్దకు చేరిందట జాక్వెలిన్ అని ప్రచారం జరుగుతూ ఉంది.
వాస్తవానికి ఆమె నిన్న విదేశానికి వెళ్తున్నది కూడా సల్మాన్ ఖాన్ ట్రూప్ లో భాగంగానేనట. గల్ఫ్ దేశాల్లో సల్మాన్ బృందం పర్యటిస్తూ అక్కడ వివిధ ప్రదర్శనలు ఇవ్వనుంది. ఆ ట్రూప్ లో జాక్వెలిన్ కూడా ఒకరు. అయితే ఈమెను దేశం దాటడానికి అనుమతులు దక్కలేదు.