ముద్దు వ‌ద్దంటే…సినిమా నుంచి తొల‌గించ‌డం క‌ష్టం కాద‌న్నారు

సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెపోటిజంపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు తాము ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన‌ట్టు టాలీవుడ్ మొద‌లుకుని బాలీవుడ్ వ‌ర‌రూ ప్ర‌తి ఒక్క‌రూ వాపోతున్నారు. తాజాగా టాలీవుడ్ న‌టి స‌మీరారెడ్డి త‌న‌కు…

సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెపోటిజంపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు తాము ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన‌ట్టు టాలీవుడ్ మొద‌లుకుని బాలీవుడ్ వ‌ర‌రూ ప్ర‌తి ఒక్క‌రూ వాపోతున్నారు. తాజాగా టాలీవుడ్ న‌టి స‌మీరారెడ్డి త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై గ‌ళ‌మెత్తారు. తెలుగు, బెంగాలీ, మలయాళ, కన్నడ చిత్రాలలో స‌మీరారెడ్డి నటించి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

త‌న‌కెలాంటి అన్యాయం జ‌రిగిందో ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పి సంచ‌ల‌నం రేకెత్తించారు.  సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటంతో స‌మానమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాల‌ని, ఏ మాత్రం తప్పటడుగు వేసినా పాము కాటు పడినట్టేన‌ని హెచ్చ‌రించారు. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

‘స్టార్‌ కిడ్స్‌ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాక్కున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్‌ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’ అని స‌మీరారెడ్డి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న తతంగాన్ని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్‌ గురించి కూడా ఆమె త‌న అభిప్రాయాల్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.  ‘ ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్‌ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చిన‌ట్టు తెలిపారు. ఇలా అనేక విష‌యాల‌ను ఆమె ఆ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు. ముద్దు స‌న్నివేశాల్లో న‌టించేందుకు అభ్యంత‌రం చెబితే…సినిమా నుంచే తొల‌గించ‌డం క‌ష్టం కాద‌నే ప‌రోక్ష హెచ్చ‌రిక స‌మీరారెడ్డి మ‌న‌సులో బ‌లంగా నాటుకుపోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. 

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నే కోరిక లేదు