స్టేట్ గెస్ట్ హౌస్ పైనా న్యాయ పొరాటమా ?

విశాఖను పాలనారాజధాని అనుకున్నాక అక్కడ అభివ్రుద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపధ్యంలో ఓషన్ వ్యూ  గెస్ట్ హౌస్ పేరిట ముప్పయి  ఎకరాల్లో భారీ ఎత్తున నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిమీద‌ అభ్యంతరాలు…

విశాఖను పాలనారాజధాని అనుకున్నాక అక్కడ అభివ్రుద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపధ్యంలో ఓషన్ వ్యూ  గెస్ట్ హౌస్ పేరిట ముప్పయి  ఎకరాల్లో భారీ ఎత్తున నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిమీద‌ అభ్యంతరాలు అపుడే మొదలయ్యాయి.

ఇది తొట్లకొండకు సమీపంలో ఉందని, బౌద్ధ మాన్యుమెంట్స్ కి విఘాతం కలిగేలా నిర్మాణాలు చేస్తున్నారని కూడా విపక్షాలతో పాటు, కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే ఇపుడు దీని మీద కోర్టుకు వెళ్ళేందుకు కూడా రంగం సిధ్ధం అయిందని చెబుతున్నారు.విశాఖకు చేసిన ఒకరు దీని మీద హై కోర్టులో పిటిషన్ ఫైల్ చేసేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.

మరో వైపు ముప్పయి ఎకరాలలో నిర్మాణం అంటే  అది గెస్ట్ హౌస్ కాదని, కచ్చితంగా  ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని కూడా ఫిర్యాదుదారులు అనుమానిస్తున్నారు. ఇక దీని మీద అమరావతి జేఏసీ ప్రతినిధులు కూడా తమ అభ్యంతరాలను కోర్టు ద్రుష్టికి తీసుకువస్తున్నారని చెబుతున్నారు.

మొత్తానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా విశాఖలో నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే వద్దంటూ కోర్టుకు వెళ్లడం పైన కూడ  లోకల్ గా  అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి స్టేట్ గెస్ట్ హౌస్ ఫేట్ ఎలా ఉంటుందో.

ఆర్ ఆర్ ఆర్  తర్వాత తారక్ ని ఆపలేం

బాలయ్య కోసం ఈ కథ రాసుకున్నా