బన్నీ సాధించాడు.. బుల్లితెరపై కూడా రికార్డ్

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసినప్పటికీ.. సాంగ్స్ అన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ…

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసినప్పటికీ.. సాంగ్స్ అన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గలేదని తాజాగా వచ్చిన రేటింగ్స్ ద్వారా ప్రూవ్ అయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆగస్ట్ 16న (ఆదివారం) జెమినీ ఛానెల్ లో ప్రసారమైన “అల వైకుంఠపురములో” సినిమాకు అత్యథికంగా 29.4 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు.. ఏపీ-తెలంగాణ రూరల్, అర్బన్.. హైదరాబాద్ అర్బన్.. ఏపీ-తెలంగాణ (స్మాల్ టౌన్స్).. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా “అల వైకుంఠపురములో” సినిమాదే రికార్డ్.

సినిమాలో బన్నీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది పూర్తిస్థాయిలో ఫ్యామిలీ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. దీనికితోడు త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ సాంగ్స్ కూడా యాడ్ అవ్వడంతో టీవీల్లో వీకెండ్ పెర్ ఫెక్ట్ మూవీ అనిపించుకుంది. అందుకే ఈ సినిమాకు భారీ టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమైంది.

మొన్నటివరకు మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా హయ్యస్ట్ రేటింగ్ సాధించిన మూవీగా ఉండేది. ఆ మూవీకి 23.4 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు బన్నీ నటించిన “అలవైకుంఠపురములో” సినిమా ఆ రికార్డ్ ను అధిగమించింది.

ఆర్ ఆర్ ఆర్   తర్వాత తారక్ ని ఆపలేం