గంజాయి వనంలో తులసి మొక్క… ?

ఆయన బాధ్యత కలిగిన పౌరుడు. పూర్వాశ్రమంలో బ్యాంక్ ఉద్యోగి. ఆ మీదట ఎమ్మెల్యే. అందుకే ఆయన మాటలతో సరిపెట్టకుండా చేతలలోకి దిగిపోయారు. సడెన్ గా ఎవరికీ చెప్పకుండా టూర్ వేశారు. ఎక్కడ గంజాయి తోటల…

ఆయన బాధ్యత కలిగిన పౌరుడు. పూర్వాశ్రమంలో బ్యాంక్ ఉద్యోగి. ఆ మీదట ఎమ్మెల్యే. అందుకే ఆయన మాటలతో సరిపెట్టకుండా చేతలలోకి దిగిపోయారు. సడెన్ గా ఎవరికీ చెప్పకుండా టూర్ వేశారు. ఎక్కడ గంజాయి తోటల సాగు జరుగుతుందో వివారాలు మొత్తం తెప్పించుకున్నారు. అంతే తన అనుచరులు, స్థానికులతో కలసి వాటిని పెద్ద ఎత్తున ద్వంసం చేశారు.

ఆయనే విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ. ఏజెన్సీకి అతి పెద్ద దరిద్రంగా ఉపద్రవంగా మారిన గంజాయి సాగుతో పాటు, నాటు సారాను నిర్మూలించేందుకు ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారు. వ్యవసాయ భూముల మధ్యలో సాగవుతున్న గంజాయి తోటలను తుదముట్టించారు. ఈ పనిలో ఆయనకు పోలీసులు కూడా తోడు అయ్యారు. మొత్తానికి గంజాయి తోటలను ద్వంసం చేయడంతోనే వదిలిపెట్టకుండా అక్కడ ఉన్న గిరిజనులను కూడా చైతన్యం చేశారు.

గంజాయి వల్ల కలిగే ముప్పుని గిరిజనులకు అర్ధమయ్యేలా చెప్పారు. నాటు సారా తాగి ఎంతో మంది గిరిజన యువత మృత్యువాత పడుతున్న తీరుని కూడా వారికి వివరించారు. గిరిజనం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హిగవు పలికారు, ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందుకుని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెట్టి ఫల్గుణ పిలుపు ఇవ్వడం నిజంగా అభినందనీయమే.  

అరకులోని బస్కీ పంచాయతీలో ఎమ్మెల్యే చేసిన ఈ ఆకస్మిక పర్యటన గంజాయి సాగు చేసే వారి గుండెల్లో దడ పుట్టించింది. అదే సమయంలో గిరిజనాన్ని చైతన్యపరచింది. శభాష్ వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు అంతా.