భారీ ఎత్తున ఉగ్రవాదులు హతం!

పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది. దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదుమంది పాక్ ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారని తెలిపింది. అలాగే పాక్ ఆర్మీకి చెందిన ఆరు నుంచి ఎనిమిది…

పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది. దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదుమంది పాక్ ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారని తెలిపింది. అలాగే పాక్ ఆర్మీకి చెందిన ఆరు నుంచి ఎనిమిది మంది జవాన్లు కూడా ఈ దాడుల్లో చనిపోయారని భారత ఆర్మీ చీఫ్ రావత్ ప్రకటించారు.

ఉగ్రకదలికలను గుర్తించి ఈ మేరకు దాడులు జరిపినట్టుగా వారు తెలిపారు. కొంతమంది ఉగ్రవాదులను రెడీ చేసి, వారిని భారత్ లోకి పంపించేందుకు అనుగుణంగా.. పాక్ రొటీన్ ప్రణాళికను ఇప్పుడు అమలు చేయ ప్రయత్నించిందని ఆర్మీ తెలిపింది. శనివారం రోజున అందుకు ఏర్పాట్లు చేసుకుని భారత సైనిక బలగాలపై కాల్పులు మొదలుపెట్టిందని, ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మరణించినట్టుగా ప్రకటించింది.

దీంతో ప్రతీకార దాడులు చేపట్టినట్టుగా పేర్కొంది. ఆ ప్రతీకారదాడుల్లో భారీ ఎత్తున ఉగ్రవాదులు హతమయ్యారని, భారత్ లోకి ఎంటర్ అవుతున్న వారిని మట్టుపెట్టినట్టుగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ విషయంలో పాక్ కూడా స్పందించింది. ఇండియా దాడులు చేసిందని ఆ దేశం ప్రకటించింది. ఆ దాడుల్లో ఆరు నుంచి పదిమంది పాక్ సైనికులు చనిపోయినట్టుగా ప్రకటించుకుంది.

ఇక కాంగ్రెస్ నేత అఖిలేష్ ప్రసాద్ సింగ్ ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు వస్తేనే.. ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయని? హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందే ఇలాంటి దాడులు జరగడం ఏమిటని? ఇన్నాళ్లూ ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?