Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రానా బ్రదర్ రెడీ ఫర్ టేకాఫ్

రానా బ్రదర్ రెడీ ఫర్ టేకాఫ్

హీరో రానా బ్రదర్.. అభిరామ్ దగ్గుబాటి ఎక్కడ? శ్రీరెడ్డి ఇస్యూ, హడావుడి తరువాత అభిరామ్ జాడ పెద్దగా బయట తెలియలేదు. తండ్రి సురేష్ బాబు తన తనయుడిని బెంగళూరు పంపారని, అక్కడ వ్యవహారాలు చూసుకుంటున్నారని వార్తలు వినవచ్చాయి. వాస్తవానికి శ్రీరెడ్డి వ్యవహారానికి ముందు అభిరామ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ మేరకు ప్రయత్నించారు. కానీ సురేష్ బాబు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సంగతి ఏమిటంటే, అభిరామ్ స్క్రీన్ మీదకు రావడానికి ఇక ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. ప్రస్తుతం అభిరామ్ అదే టార్గెట్ గా పెట్టుకుని ముంబాయిలో వున్నట్లు తెలుస్తోంది.

ముంబాయిలోని లీడింగ్ యాక్టింగ్ ట్రయినర్ దగ్గర అభిరామ్ శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల శిక్షణలు తీసుకుంటున్నారని, ఇక వెనక్కు రావడానికి ఎంతో టైమ్ లేదని తెలుస్తోంది. సరైన లాంచింగ్ స్క్రిప్ట్ కోసం సురేష్ బాబు చూస్తున్నారని బోగట్టా. అలాంటి స్క్రిప్ట్ దొరికితే వెంటనే స్వంత బ్యానర్ లోనే మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?