వైజాగ్ టెస్టులో అదరగొడుతున్న టీమిండియా!

ఓపెనర్లు రాణించడంతో విశాఖ టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 502 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. ఏడు వికెట్లను కోల్పోయి ఈ మొత్తాన్ని…

ఓపెనర్లు రాణించడంతో విశాఖ టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 502 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. ఏడు వికెట్లను కోల్పోయి ఈ మొత్తాన్ని సాధించింది టీమిండియా. ఈ స్కోరులో ప్రధాన కాంట్రిబ్యూషన్ ఓపెనర్లదే.

తొలిసారి ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు అద్భుతంగా ఆడారు. తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిలో రోహిత్ శర్మ 176 పరుగులకు ఔట్ కాగా, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఫీట్ సాధించిన ఇరవై మూడవ భారత క్రికెటర్ గా రికార్డుల పుటల్లోకి ఎక్కాడు మయాంక్.

ఓపెనర్లు రాణించినా మిడిల్ ఆర్డర్ మాత్రం విఫలం అయ్యింది. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యానికి తగినట్టుగా మిడిల్ ఆర్డర్ ఆడలేదు. వికెట్లను పారేసుకున్నారు. 502 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేశాడు కెప్టెన్ కొహ్లీ.తొలిరోజు ఆట టీ విరామం తర్వాత సాగలేదు. దీంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. రెండో రోజు మాత్రం వరణుడి ఆటంకాలు ఏమీ లేవు. మంచి స్థాయి స్కోరు సాధించడంతో ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'