ఎన్టీఆర్ 30 సినిమా స్క్రిప్ట్ ఓ కొలిక్కి వస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక పట్టాన స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవడం లేదు. మామూలుగానే కొరటాల శివ స్క్రిప్ట్ తయారీకి చాలా టైమ్ తీసుకుంటారు.
తానే ఒంటరిగా కూర్చుని స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు తప్ప మందీ మార్బలం వుండదు. సినిమా మేకింగ్ అంతా కూడా ముందే పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. అందుకే చాలా టైమ్ పడుతుంది. దీనికి ఈసారి ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా చేయడం అన్న వత్తిడి అదనం. అలాగే ఆచార్య ఫెయిల్యూర్ ను తన ఖాతాలోంచి చెరిపేయాల్సిన టెన్షన్ అదనం.
అందుకే అంతా టైమ్ పడుతోంది. టైమ్ తీసుకుంటున్నారు. ఇప్పటికి జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, అనిరుధ్ సంగీత దర్శకుడిగా వుండనే వున్నారు. సెట్ మీదకు వెళ్లడమే తరువాయి. పక్కా షెడ్యూళ్లు వేసుకోవాలి. అలా వేయాలి అంటే పాన్ ఇండియా సినిమా కోసం ఫిక్స్ చేసిన కాంబినేషన్ ల డేట్ లు అన్నీ కుదరాలి. పైగా వన్స్ స్టార్ట్ అయ్యాక రెండు మూడు రోజులు చేసి ఆపడం లాంటి వ్యవహారాలు కొరటాలకు నప్పవు.
అందుకే వీలయినంత లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారు. అలా చేయడం కోసం అనువైన టైమ్ ను వెదుకుతున్నారని ఫిబ్రవరి నుంచి షూట్ వుంటుందని తెలుస్తోంది. ఈ లోగా ముహుర్తాల లాంటివి వుండొచ్చు.