నభా నటేష్ తో ఆ హాట్ సీన్లు తీశారా..?

బాలీవుడ్ లో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా తెలుగులో వస్తోంది మాస్ట్రో మూవీ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో…

బాలీవుడ్ లో హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా తెలుగులో వస్తోంది మాస్ట్రో మూవీ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది. అయితే బాలీవుడ్ లో రాధిక ఫుల్ గ్లామరస్ గా కనిపించింది, కొన్ని సన్నివేశాల్లో చాలా హాట్ గా, బోల్డ్ గా కూడా నటించింది. హీరోతో లిప్ కిస్సులు, శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి.

మరి తెలుగులో కూడా అవే సన్నివేశాల్ని రిపీట్ చేశారా..? నితిన్-నభా మధ్య హాట్ సీన్లు పెట్టారా? ఈ కోణంలో చాలామంది ఆలోచించారు. సినిమా స్ట్రీమింగ్ కు ముందే వీటిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది నభా నటేష్. తన పాత్రతో పాటు సినిమాలో చాలా సన్నివేశాలు మార్చేశారని చెబుతోంది.

“రాధిక ఆప్టే అద్భుతంగా చేసింది. నేను అలా చేయగలనా అనిపించింది. కానీ దర్శకుడు కథను మాత్రం తీసుకుని తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పుచేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది తప్ప రీమేక్ అనిపించదు. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది.”

తను గ్లామరస్ గా కనిపిస్తాను తప్ప, బోల్డ్ గా కనిపించనని ఇలా పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది నభా నటేష్. నిజానికి రాధిక అంత బోల్డ్ గా నటించడం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ వల్ల కాదు. అందుకే ఆ పాత్రకు మార్పులు చేశారు. దీంతో నభా పని ఈజీ అయిపోయింది.