విఠ‌లాచార్య సినిమాల‌ను త‌ల‌పించేలా!

తెలంగాణ‌ రాజ‌కీయాల‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ ఘ‌ట‌న రాజ‌కీయ‌ల‌ను కుదిపేస్తోంది. మీరు త‌ప్పు చేశారు అంటే మీరు త‌ప్పు చేశారు అంటూ టీఆర్ఎస్-బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల‌ వార్ న‌డుస్తోంది. తాజాగా…

తెలంగాణ‌ రాజ‌కీయాల‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ ఘ‌ట‌న రాజ‌కీయ‌ల‌ను కుదిపేస్తోంది. మీరు త‌ప్పు చేశారు అంటే మీరు త‌ప్పు చేశారు అంటూ టీఆర్ఎస్-బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల‌ వార్ న‌డుస్తోంది. తాజాగా మొయినాబాద్ ఫాం ఘ‌ట‌న‌కు త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎలాంటి విచార‌ణ‌కు అయిన సిద్ధంగా ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి సృష్టం చేశారు. కేసీఆర్ కు చిత్త‌శుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జీతో కానీ లేదా సీబీఐతో కానీ విచారణ చేయించాల‌ని డిమాండ్ చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి జిమ్మిక్కులు చేసింద‌ని, ఇప్పుడు కూడా మునుగోడు ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇలాంటి డ్రామాలు అడుతున్నారంటూ ఆరోపించారు. ఫాం హౌసుకు డ‌బ్బు తెచ్చుకుంది, పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేన‌ని అన్నారు. టీఆర్ఎస్ వ్య‌వ‌హారం చూస్తుంటే దొంగే… దొంగా దొంగా అని అరిచిన‌ట్టు ఉంద‌న్నారు.

నిన్న ఫాం హౌస్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌ట‌న విఠ‌లాచార్య సినిమాల‌ను త‌ల‌పించేలా కేసీఆర్ క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ఉంద‌ని సెటైర్ వేశారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత చిల్ల‌ర రాజ‌కీయం అవ‌స‌ర‌మా కేసీఆర్ అంటూ… ఆ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా..? అని ప్రశ్నించారు.  

మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక విజ‌యం అనేది రాజ‌కీయా పార్టీల‌కు ఎంత అవ‌స‌ర‌మే నిన్న జ‌రిగిన ఘ‌ట‌న ద్వారా తెలుస్తోంది. బీజేపీపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో బీజేపీ పార్టీ హైకోర్టుకు వెళ్లబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఫాం హౌస్ ఘ‌ట‌న‌పై మాట్లాడ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.