మన హీరోలకు కొన్ని కోరికలు వుంటాయి. అందుకు అనుగుణంగా టెక్నికల్ కాస్ట్ ను సెట్ చేసుకోవాల్సిందే నిర్మాతలు. దానికి కాస్త ఎక్కువ ఖర్చు అయినా సరే. తమిళ యువ సంగీత సంచలనం అనిరుధ్ వ్యవహారం ఇలాంటిదే.
అతగాడికి తమిళనాట విపరీతమైన క్రేజ్ వుంది. కానీ అలా అని తెలుగులో అద్భుతమైన, ఎక్స్ ట్రార్డినరీ ఆల్బమ్ ఇచ్చిందీ లేదు. చేసిన సినిమాలు అన్నింటిలో ఒకటీ, రెండు హిట్ సాంగ్ లు తప్ప, రికార్డులు తిరగరాసిన పాటలే లేవు. అయినా మన హీరోలకు కాస్త క్రేజ్.
తమ సినిమాలకు అతగాడు పని చేయాలని. దాంతో అతగాడి రేటు అలా అలా ఆకాశాన్ని అంటుతోంది. గతంలో తెలుగులో సినిమాలు చేసినపుడు మూడు కోట్ల వరకు చార్జ్ చేసిన అనిరుధ్ ఇప్పుడు ఏకంగా నాలుగున్నర కోట్లు కోట్ చేస్తున్నాడట.
లేటెస్ట్ గా ఓ సినిమాకు సైన్ చేసాడు. ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో తయారయ్యే ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ నాలుగున్నర కోట్లు అడిగాడని తెలుస్తోంది. మరి ఎంత తగ్గించారో, ఎంతకు బేరం ఆడారో మరి.
ఎంతయినా నాలుగు కోట్లకు తగ్గేదే లే అంటాడేమో అనిరుధ్. నాలుగు కోట్లు అయినా కూడా తెలుగులో ఇదే రికార్డు పారితోషికం అవుతుంది.