వారం రోజులే టైమ్.. చంద్రబాబు ఖాళీ చేస్తారా?

కృష్ణానది కరకట్ట మీద నిర్మితమైన అక్రమ నిర్మాణాలు అన్నింటికీ నోటీసుల జారీ అయ్యాయి. అక్రమంగా నిర్మితం అయిన ప్రజావేదికను ప్రభుత్వం కూలదోయడంతో చాలామంది సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నివసిస్తున్న…

కృష్ణానది కరకట్ట మీద నిర్మితమైన అక్రమ నిర్మాణాలు అన్నింటికీ నోటీసుల జారీ అయ్యాయి. అక్రమంగా నిర్మితం అయిన ప్రజావేదికను ప్రభుత్వం కూలదోయడంతో చాలామంది సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్స్ కు కూడా నోటీసులు అందాయి.

లింగమనేని ఎస్టేట్స్ అక్రమ నిర్మాణమే అని సీఆర్డీఏ నిర్ధారించింది. ఈ మేరకు నోటీసులు జారీచేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఆ భవనానికి అధికారులు నోటీసులు అతికించారు! అది అక్రమ నిర్మాణం అని.. వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణకు వారంరోజుల సమయం కేటాయించారు.

చంద్రబాబు నివాసంతో పాటు.. మొత్తం ఇరవైకి పైగా కరకట్ట భవంతులకు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. అలా నోటీసులు అందుకున్న వారిలో తెలుగుదేశం నేతలు ప్రస్తావించిన ఆశ్రమం కూడా ఉండటం గమనార్హం. సదరు ఆశ్రమానికి కూడా నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది.

వీరు మూకుమ్మడిగా ఆ ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించేస్తారా? కోర్టుకు వెళతారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇంతకీ చంద్రబాబు పరిస్థితి ఏమిటనేది ఇంకా అధికారికంగా వెల్లడి కావడంలేదు. అక్రమ నిర్మాణం అని నోటీసులు అందుకున్న ఇంటిలోనే నివసిస్తూ చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం చేస్తారా? లేక అది అద్దె ఇల్లే అని దాన్ని ఖాళీ చేసి.. ఇన్నాళ్లూ తను ఒక అక్రమ నిర్మాణంలో నివసించిన విషయాన్ని ఒప్పుకుంటారా? అనేది ఈ వారం రోజుల్లోనే తేలిపోనుంది!  

జగన్‌ తప్పులు చేయవచ్చు.. ఇప్పుడున్న వేవ్‌ అప్పుడుండదు