ఆ విధంగా లోకేష్ బతికిపోయాడు..!

నారాలోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అదృష్టవంతుడయ్యారు. లేకపోతే వైసీపీ నేతలు చేసే ర్యాగింగ్ కి అసెంబ్లీ మానేసి ఇంటికి పరిగెత్తేవాడేమో. రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ పేరు మారుమోగిపోవడమే దీనికి ఉదాహరణ. సోమవారం…

నారాలోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అదృష్టవంతుడయ్యారు. లేకపోతే వైసీపీ నేతలు చేసే ర్యాగింగ్ కి అసెంబ్లీ మానేసి ఇంటికి పరిగెత్తేవాడేమో. రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ పేరు మారుమోగిపోవడమే దీనికి ఉదాహరణ. సోమవారం జరిగిన సమావేశాల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ అనే పేరెత్తకుండానే చినబాబు గాలి తీసేశారు. రాజకీయ అనుభవం ప్రస్తావనకు రాగా.. తానేమీ పోటీచేసిన నియోజకవర్గం పేరు కూడా పలకలేని పప్పుని కాదని ఆయన ఎద్దేవా చేశారు. సదరు పప్పు మంగళగిరిని మందళగిరి అంటారని దెప్పిపొడిచారు. అంతటితో ఆ ప్రస్తావన ఆగిపోయింది.

ఇక మంగళవారం సమావేశాల్లో అనవసరంగా అచ్చెన్నాయుడు ఈ సబ్జెక్ట్ ని తవ్వుకుని మరోసారి చంద్రబాబుకి ఇరిటేషన్ తెప్పించారు. సభలో లేని లోకేష్ ని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదని మంత్రి అనిల్ కు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అనిల్ మరోసారి టీడీపీపై ధ్వజమెత్తారు. తాను లోకేష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, కేవలం పప్పు అని మాత్రమే అన్నానని, పప్పు అనే పదానికి మీరు గూగుల్ లో అర్థాలు వెదికి.. భుజాలు తడుముకోవడం ఎందుకని కౌంటర్ ఇచ్చారు.

దీంతో మరోసారి సభ ఘొల్లుమంది. అచ్చెన్నాయుడు సహా చంద్రబాబుకి కూడా మతిపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని అనుకున్నారు. సభలో లేకపోతేనే లోకేష్ ని ఈ రేంజ్ లో ఆడుకుంటున్న వైసీపీ నేతలు, ఇక సభకి వస్తే ఆయన్ని చెడుగుడు ఆడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో లోకేష్ అదృష్టవంతుడని, ఓడిపోయి బతికిపోయాడంటూ జోకులేసుకుంటున్నారు ఎమ్మెల్యేలంతా. నిజంగా గెలిచి అసెంబ్లీలోకి వచ్చి ఉంటే ఆ టార్చర్ ను లోకేష్ భరించలేడంటూ సెటైర్లు షురూ చేశారు.

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు