Advertisement

Advertisement


Home > Movies - Movie News

విలన్ అవుదామని వచ్చాను.. కానీ?

విలన్ అవుదామని వచ్చాను.. కానీ?

డాక్టర్ అవుదామనుకొని యాక్టర్ అయ్యారని చాలామంది నటీనటులు చెబుతుంటారు. కానీ ప్రియదర్శి మాత్రం విలన్ అవుదామనుకున్నాడట. అదే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాడట. కానీ అనుకోకుండా కమెడియన్ అయ్యాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు.

"నేను కమెడియన్ అవుదామని రాలేదు. విలన్ అవుదామని వచ్చాను. నా మొదటి 2 సినిమాల్లో నేను విలన్. అప్పట్లో కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లా ఊహించుకునేవాడ్ని. టెర్రర్, బొమ్మలరామారం లాంటి సినిమాల్లో విలన్ గా చేశాను."

కేవలం అవకాశాల్లేక పెళ్లిచూపులు సినిమా చేశానని, అది తన జీవితాన్ని మార్చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటున్నాడు ప్రియదర్శి. మరీ ముఖ్యంగా తనను కమెడియన్ గా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదన్నాడు.

"పెళ్లిచూపులు సినిమా నా కెరీర్ ను మార్చేసింది. అందులో నాతో కామెడీ చేయించారు. ఏదో ఒక ఛాన్స్ వచ్చిందిలే అనుకొని చేశా. అప్పటికి నాకు పనిలేదు, తినడానికి తిండి లేదు. అందుకే చేశా. కానీ ఆ సినిమాలో నా పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యా."

నిజానికి పెళ్లిచూపులు సినిమాలో తను చాలా సీరియస్ గా నటించానని, ఎక్కడా నవ్వలేదని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. అప్పటికే విలన్ గా చేసిన అనుభవం ఉండడంతో ఆ సీరియస్ నెస్ ను చూపించానని, కానీ అదే కామెడీగా మారి అందరూ నవ్వుతుంటే తనకు ఆశ్చర్యం వేసిందన్నాడు. ఇక అప్పట్నుంచి తను కామెడీ పాత్రలే ఎక్కువగా చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?