ఎల్లో మీడియా నోరు మూయించిన జగన్

సమతూకం.. సమతూకం.. జగన్ కేబినెట్ గురించి ఎవరు మాట్లాడినా, ఏ విశ్లేషణ చూసినా.. ఇదే వినిపిస్తోంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎంత నేర్పుతో పాలన చేస్తారనడానికి ఆయన మంత్రివర్గ కూర్పే ఓ పెద్ద ఉదాహరణ.…

సమతూకం.. సమతూకం.. జగన్ కేబినెట్ గురించి ఎవరు మాట్లాడినా, ఏ విశ్లేషణ చూసినా.. ఇదే వినిపిస్తోంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎంత నేర్పుతో పాలన చేస్తారనడానికి ఆయన మంత్రివర్గ కూర్పే ఓ పెద్ద ఉదాహరణ. అయితే ఈ కూర్పులో రెడ్డి సామాజిక వర్గం మాత్రం పెద్ద త్యాగం చేసిందనే చెప్పాలి.

25 మంది ఉన్న కేబినెట్ లో తన సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మాత్రమే జగన్ మంత్రులుగా అవకాశమిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జగన్ రాకతో రాష్ట్రంలో రెడ్డి డామినేషన్ మొదలవుతోందని ఓ బ్యాచ్ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. అధికారుల్లో ఎవరెవరు రెడ్లు ఉన్నారు, వారిలో ఎవరెవరు జగన్ తో టచ్ లో ఉన్నారు అనే విషయాలను కూపీలాగి మరీ సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారు.

నలుగురు రెడ్డి అధికారులు సీఎంని కలిసినా అది తప్పే అన్నట్టుగా చిత్రీకరించారు. పొరపాటున కమ్మ సామాజిక వర్గ అధికారిని బదిలీ చేసి, అందులో రెడ్డి కులానికి చెందినవారిని తెచ్చిపెడితే అది పెద్ద అపరాధంగా చిత్రీకరించారు. ఈ 10 రోజుల్లో ఇలాంటి చాలా వార్తల్ని సోషల్ మీడియాలో చూశాం, తోకపత్రికలు కూడా పరోక్షంగా ఇలాంటి అంశాల్ని హైలెట్ చేస్తున్నాయి కూడా.

ఈ పచ్చబ్యాచ్ నోర్లు మూయించేందుకే జగన్ మంత్రివర్గ కూర్పులో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 25మంది ఉన్న మంత్రివర్గంలో కనీసం నాలుగోవంతు కూడా రెడ్డి కులానికి కేటాయించలేదు. రెడ్డి కమ్యూనిటీతో సమానంగా కాపులకు 4 పదవులిచ్చారు. మైనార్టీ సహా బీసీలకు మొత్తం 8మంత్రి పదవులు కేటాయించారు.

ఎస్సీలకు అత్యథికంగా 5 మంత్రి పదవులిచ్చారు. వైశ్య, కమ్మ, క్షత్రియ, ఎస్టీలకు ఒక్కో పదవిదక్కింది. తన సామాజిక వర్గంపై అపవాదు పడకూడదనే ఉద్దేశంతోటే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఎల్లో మీడియా నోరు మూయించడానికి జగన్ కు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు కదా. 

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?