పవన్‌ కళ్యాణ్‌ ఇక రిటైర్‌ అయినట్టే

ఇటీవల జరిగిన ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వ్యవస్థాపక నిర్మాణం, వనరులు లేకుండా అభిమాన బలాన్ని నమ్ముకుని పోటీ చేసిన పవన్‌కళ్యాణ్‌కి ఓటమి తప్పలేదు. జనసేన ఇంత ఘోరంగా …

ఇటీవల జరిగిన ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వ్యవస్థాపక నిర్మాణం, వనరులు లేకుండా అభిమాన బలాన్ని నమ్ముకుని పోటీ చేసిన పవన్‌కళ్యాణ్‌కి ఓటమి తప్పలేదు. జనసేన ఇంత ఘోరంగా  ఓడిపోతుందని ఊహించకపోయినా కానీ ఖచ్చితంగా రేసులో లేననేది అయితే పవన్‌కి తెలుసు. వైసీపీ వేవ్‌ వుండడం వల్ల జనసేన ఆశించిన ఫలితాలని కూడా అందుకోలేకపోయింది. అయితే దీంతో నీరుగారిపోయి పవన్‌ రాజకీయాలు విడిచి పెట్టడం లేదు.

ఎమ్మెల్యే కూడా కాకుండా వచ్చే అయిదేళ్ల పాటు రాజకీయ రంగంలో పవన్‌ ఏమి చేస్తాడంటూ విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. మళ్లీ సినిమాలు మొదలు పెడతాడని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్‌ మాత్రం వచ్చే పదేళ్లలో పార్టీని ఒక శక్తిగా మలిచే యత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ బాగా వీక్‌ అవడం కూడా పవన్‌కి ఊతమిస్తోంది. అందుకే ఇక సినిమా చర్చలు ముగించేసి మకాం కూడా పూర్తిగా అమరావతికే మార్చేసాడు.

ప్రస్తుతం పార్టీ తదుపరి కార్యాచరణ విషయంపై చర్చలు సాగిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికో, ఇరుకున పెట్టడానికో ప్రయత్నించడం లేదు. కొత్త ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చి వారు తప్పులు చేసినపుడు ప్రజల పక్షాన పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకి చెప్పినట్టు సమాచారం. ఓటమి తర్వాత తనని మరింత తక్కువగా చూస్తున్నా కానీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తీరాలనే పవన్‌ కృతనిశ్చయంతో వున్నాడనేది సుస్పష్టం.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?