ఈ విషయంలో చంద్రబాబు అదృష్టవంతుడేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు తెలంగాణలోలా వుండవా.? అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ముప్పూలేనట్లే కన్పిస్తోంది. కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం టీడీపీకి ముప్పు…

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు తెలంగాణలోలా వుండవా.? అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ముప్పూలేనట్లే కన్పిస్తోంది. కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం టీడీపీకి ముప్పు తప్పేలా లేదు. టీడీపీ ఎంపీ కేశినేని నాని, బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా సెటైర్లు వేయడం తెల్సిన విషయాలే.

ఇక, తెలంగాణ రాజకీయాలకు వస్తే, సీఎల్పీని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంలో విలీనం చేసేశారు తెలంగాణ స్పీకర్‌. టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు ఇచ్చిన లేఖ దెబ్బకి, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాని కోల్పోయింది. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు కాంగ్రెస్‌కి తెలంగాణలో. అందులో ఇద్దరు టీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళ్ళారట. మరో నలుగురిలో ఎవరు చివరిదాకా కాంగ్రెస్‌లో వుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఆంధ్రప్రదేశ్‌లో గనుక, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే, గతంలో టీడీపీ చేసిన దాష్టీకానికి రివెంజ్‌ తీర్చుకోవాలనుకుంటే.. ఓ నెల రోజుల్లోనే టీడీపీ ఖేల్‌ ఖతమ్‌ అయిపోతుందన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వైసీపీతో టచ్‌లోకి వెళుతున్నా, సింపుల్‌గా 'సారీ' చెప్పేస్తున్నారట వైసీపీ ముఖ్యనేతలు. 'సారీ నో వేకెన్సీ' అంటూ వైసీపీ అధినాయకత్వం చెబుతోంటే, చేసేదిలేక.. టీడీపీలో వుండలేక.. బీజేపీ వైపు చూస్తున్నారు సదరు తెలుగు తమ్ముళ్ళు.

ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ సీట్లు లేవు గనుక, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి తద్వారా వచ్చే 'వాపుని బలుపుగా' చూపించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నమాట వాస్తవం. అయితే, బీజేపీ వైపు ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు వెళతారన్నది ఇప్పుడే చెప్పలేం. 'ఒకరిద్దరు పార్టీని వీడినా నష్టంలేదు' అని టీడీపీ అధినాయకత్వమే చెబుతోందంటే, పార్టీ ఫిరాయింపులపై ఆ పార్టీలో అప్పుడే వణుకు మొదలైందని అనుకోవచ్చు.

కానీ, శాసనసభా పక్ష విలీనాల్లాంటి 'వైపరీత్యాలు' ఆంధ్రప్రదేశ్‌లో వుండవని టీడీపీ బలంగా నమ్ముతోంది. వైఎస్‌ జగన్‌ మీద అంత గొప్ప నమ్మకం వుందన్నమాట తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికైతే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన లేని వైసీపీ, ఐదేళ్ళూ అదే మాట మీద నిలబడితే, చంద్రబాబు అదృష్టవంతుడి కిందే లెక్క.. ఎలాగోలా ఐదేళ్ళు పార్టీని అలా అలా లాగేయొచ్చు.

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు

సినిమా రివ్యూ: హిప్పీ