జగన్ ఇలాంటివి కట్టడి చేయాలి

ప్రతి ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్లు కొన్ని వుంటాయి. తెలంగాణలో చినజీయర్ స్వామి అనుగ్రహం వుంటే ఏదైనా సాధ్యం అనే టాక్ వుంది. ఇప్పుడు ఇలాంటి టాక్ ఆంధ్రలో కూడా బయల్దేరింది. విశాఖకు చెందిన స్వరూపానంద…

ప్రతి ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్లు కొన్ని వుంటాయి. తెలంగాణలో చినజీయర్ స్వామి అనుగ్రహం వుంటే ఏదైనా సాధ్యం అనే టాక్ వుంది. ఇప్పుడు ఇలాంటి టాక్ ఆంధ్రలో కూడా బయల్దేరింది. విశాఖకు చెందిన స్వరూపానంద స్వామి అనుగ్రహం వుంటే జగన్ ప్రభుత్వంలో అన్నీ సాధ్యం అన్న భావన స్టార్ట్ అవుతోంది.

అప్పుడే ఎమ్మెల్యేలు ఈ స్వామీజీ ఆశ్రమానికి క్యూ కడుతున్నారు. మంత్రి పదవుల ఆశ దీనివెనుక వుందని ఇట్టే అర్థం అయిపోతోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ నవయగు విశ్వేశ్వరరావు కూడా స్వామీజీని సందర్శించుకున్నారు. ఎప్పుడూ అటు రాని పెద్దమనిష ఇప్పుడు ఎందుకు వచ్చారో జనం ఇట్టే అర్థం చేసుకోగలరు.

స్వామీజీలు ఇలా పవర్ సెంటర్లుగా మారితే జగన్ కే నష్టం. జగన్ ఆ స్వామీజీ మాట వినొచ్చు. వినకపోవచ్చు. కానీ ఇలాంటి ప్రచారం మాత్రం వైకాపా ప్రభుత్వానికి మంచి చేయదు. స్వామీజీని ఇలాంటి వ్యవహారాల నుంచి జగన్ కట్టడి చేయలేకపోవచ్చు. కానీ ఆ స్వామీజీ చెబితే పని జరగదు అనే సంకేతాలు అయినా ఇవ్వాలి. పార్టీలోకి, పార్టీ జనాల్లోకి ఆ సందేశం పంపించగలగాలి.

అసలే వేయి కళ్లతో గమనిస్తున్నారు జగన్ ప్రభుత్వ వ్యవహారాలను. ఇలాంటివి ఇట్టే జనంలోకి వెళ్లి ఎంత నెగిటివ్ చేయాలో అంతా చేస్తాయి.