కాంగ్రెస్ లో ఉంటే బాబు భజన చేయాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నందుకు కాంగ్రెస్ నాయకులు అందరూ చంద్రబాబు భజన చేయాల్సిందేనా? చందభజన మానేసి… స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెల్లడించేట్లయితే.. వారిని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండనివ్వకుండా పొగబెట్టి బయటకు పంపేస్తారా? కాంగ్రెస్ పార్టీలో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నందుకు కాంగ్రెస్ నాయకులు అందరూ చంద్రబాబు భజన చేయాల్సిందేనా? చందభజన మానేసి… స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెల్లడించేట్లయితే.. వారిని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండనివ్వకుండా పొగబెట్టి బయటకు పంపేస్తారా? కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉద్ధండులు అయినా… పార్టీకి ఎంత విశ్వాసపాత్రులు అయినా.. వర్తమాన పరిస్థితుల్లో చంద్రబాబు భజన చేయకపోతే.. ఇక ఆ పార్టీలో మిగలనివ్వరా అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. వారిని వెళ్లగొట్టడానికి తగిన స్కెచ్ లను కూడా తెలుగుదేశం నాయకులే సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు- రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు కూడా. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ వంటివాడు అని గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వైఎస్ మరణానంతరం.. జగన్ పెట్టిన పార్టీలోకి రాకుండా… తాను అన్నాళ్లుగా ఉన్న కాంగ్రెసులోనే ఉండిపోయారు. అయితే గతిలేని పరిస్థితుల్లో చంద్రబాబు- కాంగ్రెస్ మిలాఖత అయిన వాతావరణంలో… ఆయన మాత్రం చంద్రబాబు భజనకు సిద్ధపడకుండా తన సొంత బాటనే అనుసరిస్తున్నారు.

కాంగ్రెస్ లో ఉన్నప్పటినుంచి కూడా కేవీపీ రామచంద్రరావు.. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను ఎండగడుతున్నారు. బహిరంగ లేఖల ద్వారా.. బాబు చేస్తున్న మాయను బయటపెట్టే ప్రయత్నం చేస్తూవచ్చారు. కాకపోతే.. ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఉన్న సమయంలో… ఆయన సైలెంట్ గా ఉండాలని తెదేపా నాయకులు కోరుకుంటున్నట్టుంది.

పోలవరం నిర్మాణంలో వైఫల్యాల గురించి ఆయన తాజాగా చంద్రబాబుకు ఓ లేఖ రాస్తే.. తెలుగుదేశం నాయకులు దాన్ని సహించలేకపోతున్నారు. కేవీపీ రామచంద్రరావు భాజపా, వైకాపా తరఫున కాంగ్రెసులో కోవర్టుగా పనిచేస్తున్నారని చంద్రబాబు కోటరీలోని వర్ల రామయ్య అంటున్నారు. జగన్ కు అనుకూలంగా కేవీపీ పావులు కదుపుతున్నారని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఎవరైనా సరే.. చంద్రబాబు వైఫల్యాలు, చేతగానితనం గురించి మాట్లాడితే.. వారికి జగన్ తో సంబంధం అంటగట్టేయాలని తెదేపా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?