నేను కసక్ అంటే.. మీరంతా ఫసక్

ఫసక్.. బాగా పాపులరైన పదం.. ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు నోటి నుంచి జాలువారిన ''ఆణిముత్యం''. దీనిపై వచ్చిన మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇదొక ఉపమానం అయిపోయింది. ఇలా అందరూ తన పదాన్ని…

ఫసక్.. బాగా పాపులరైన పదం.. ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు నోటి నుంచి జాలువారిన ''ఆణిముత్యం''. దీనిపై వచ్చిన మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇదొక ఉపమానం అయిపోయింది. ఇలా అందరూ తన పదాన్ని వాడేస్తుంటే మోహన్ బాబు కూడా తన సినిమాలో దాన్ని వాడేశారు.  

సన్నాఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు మోహన్ బాబు. లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఇందులో నటించడమే కాకుండా, దీనికి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు మోహన్ బాబు. ఈ సినిమా టీజర్ ఈరోజు లాంఛ్ అయింది. ఇందులో చివర్లో వచ్చే పంచ్ డైలాగ్ లో ఫసక్ అనే పదం వాడారు మోహన్ బాబు.

టీజర్ లో రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు మోహన్ బాబు. ఇన్ని గెటప్స్ ఉంటాయనే విషయం టీజర్ రిలీజైనంత వరకు ఎవ్వరికీ తెలియదు. మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పడం.

మంచు విష్ణు, మోహన్ బాబు నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇంతకుముందు ఈ దర్శకుడు ఆది సాయికుమార్ హీరోగా బుర్రకథ అనే సినిమా తీశాడు. ఆ ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మోహన్ బాబు మూవీతో మనముందుకొస్తున్నాడు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.