కలుగులో నుంచి బయటకొచ్చిన ప్రతిపక్షాలు

ఎంపీ రఘురామ కృష్ణంరాజు, జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వెనక ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. జగన్ టికెట్ ఇస్తే, జగన్ బొమ్మతో ప్రచారం చేసుకుని, ఫ్యాను గుర్తుపై గెలిచిన రఘురామ.. ఆ తర్వాత…

ఎంపీ రఘురామ కృష్ణంరాజు, జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వెనక ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. జగన్ టికెట్ ఇస్తే, జగన్ బొమ్మతో ప్రచారం చేసుకుని, ఫ్యాను గుర్తుపై గెలిచిన రఘురామ.. ఆ తర్వాత తనకు తానే పెద్ద హీరో అంటూ బిల్డబ్ ఇచ్చుకున్నారు. రచ్చబండ పేరుతో ఏపీ ప్రభుత్వంపై బండలు వేసే కార్యక్రమం మొదలు పెట్టారు.

స్వతహాగా రఘురామకు అంత సీన్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. పంచ్ డైలాగులు, పడికట్టు పదాలు.. అన్నీ అద్దెకు తెచ్చుకున్నవే. టీడీపీ అద్దె మైకులు సమర్పించినవే. 

అందుకే ఏ-1గా రఘురామతో పాటు, ఏ2గా టీవీ5 ఏ3గా ఏబీఎన్ ఛానెల్ ని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సీఐడీ. మరి టీవీ5, ఏబీఎన్ అంటే వాటి వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ రఘురామకృష్ణంరాజుని పరోక్షంగా ఎగదోసింది టీడీపీయేననే విషయం ఇలా కూడా నిర్థారణ అయింది.

నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ, తమ అనుకూల ఛానెల్స్ లో అతడి విద్వేష ప్రసంగాల్ని ప్రసారం చేసి చోద్యం చూశాయి ప్రతిపక్షాలు. గట్టిగా అడిగితే సంబంధం లేదన్నట్టు, చూసీచూడనట్టు వ్యవహరించాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక్కొక్కటే కలుగులోనుంచి బయట పడుతున్నాయి. 

రఘురామను వెనసేకుకొస్తూ మాట్లాడుతున్నాయి. నిజానికి రఘురామ గెలిచింది వైసీపీ జెండాపైన. టిక్కెట్ ఇచ్చింది జగన్. ఆయన విమర్శలు చేస్తోంది వైసీపీపైన. కాబట్టి ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ప్రతిపక్షాలు రియాక్ట్ అవ్వడం వెనక కుట్ర ఏంటో ఇప్పుడు అందరికీ ఈజీగా అర్థమౌతుంది.

టీడీపీ ఏడుపు

రఘురామ ఎపిసోడ్ తర్వాత.. ప్రజల తరపున ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ అంత్ ఇంతా కాదు. ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ మండిపడ్డారు. అసలు లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని లాజిక్ తీశారు. ఒకవేళ రఘురామ టీడీపీ ఎంపీ అయినా కూడా ఆయన అరెస్ట్ తర్వాత చంద్రబాబు ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేవారు కాదేమో అన్నట్టుగా అతి చేశారు బాబు.

ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా వారెంట్ లేకుండా రఘురామను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు ఏపీ ప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోవాలంటూ శాపనార్థాలు పెట్టారు. ఇక ట్విట్టర్ పిట్ట నారో లోకేష్.. ఎంపీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయనకు బైపాస్ ఆపరేషన్ జరిగిందని, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ట్వీటాగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

పవన్ ఫుల్ సపోర్ట్..

తిరుపతి ఉప ఎన్నికల ఫలితం తర్వాత అసలు ట్విట్టర్ కి కూడా అందకుండా ఉన్న పవన్ కల్యాణ్, ఆ మధ్య రుయా ఆస్పత్రి ఘటన తర్వాత నేనున్నానంటూ బయటకొచ్చారు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో అంతకంటే ఎక్కువగా బాధపడ్డారు. 

ఎంపీని అరెస్ట్ చేసేందుకు ఇదా సమయం అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. సమయం, సందర్భం, మహూర్తం చూసుకుని ఎంపీని అరెస్ట్ చేయాలని ఆయన ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చారు. మొత్తమ్మీద ఎంపీ వెనక చంద్రబాబు ఉంటే, ఆయన వెనక దత్తపుత్రుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు.

బీజేపీ తక్కువ తిన్నదా..

ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ గట్టిగా స్పందించలేకపోతోంది. అలా అని అరెస్ట్ వ్యవహారాన్ని వదిలిపెట్టలేక నిరంకుశత్వానికి నిదర్శనం అంటూ విమర్శిస్తోంది. రఘురామకృష్ణంరాజుకి గట్టిగా మద్దతిస్తే, ఆయనతో కుమ్మక్కు అయినట్టు తెలిసిపోతుంది కాబట్టి.. ఆచితూచి స్పందిస్తున్నారు బీజేపీ నేతలు. కి

షన్ రెడ్డి లాంటి నేతలు సైతం పైపైన విమర్శలు చేసి చేతులు దులుపుకున్నారు. మీడియా స్వేచ్ఛ అంటూ కాకమ్మ కథలు చెప్పి తప్పుకున్నారు. కానీ రఘురామకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

నిస్సిగ్గుగా సీపీఐ..

చంద్రబాబుకి వంత పాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజుకి మద్దతు తెలపడం దారుణం. అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నారని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని మండిపడ్డారాయన.

మొత్తమ్మీద.. రఘురామ అరెస్ట్ తో ఈ విషయంపై ఇన్నాళ్లూ తెరవెనక ఉన్న ప్రతిపక్షాలన్నీ బయటకొచ్చాయి. తమ అసలు రంగు బయటపెట్టుకున్నాయి.