కవచం ప్రీ రిలీజ్ బిజినెస్

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే నలభై కోట్ల సినిమా. నలబై కోట్ల మార్కెట్ అన్నట్లు ప్లాన్డ్ గా తయారుచేసాడు తండ్రి బెల్లంకొండ సురేష్. ఆ ప్లానింగ్ కు మెచ్చుకోవాల్సిందే. కానీ జయజానకీనాయక బడ్జెట్ నలభై దాటడం…

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే నలభై కోట్ల సినిమా. నలబై కోట్ల మార్కెట్ అన్నట్లు ప్లాన్డ్ గా తయారుచేసాడు తండ్రి బెల్లంకొండ సురేష్. ఆ ప్లానింగ్ కు మెచ్చుకోవాల్సిందే. కానీ జయజానకీనాయక బడ్జెట్ నలభై దాటడం వల్ల సమస్య వచ్చింది. సాక్ష్యం సినిమా అనుకున్న ఫలితం సాధించలేక సమస్య అయింది. అందుకే ఈసారి బెల్లంకొండ రూట్ మార్చారు. తన కొడుకు సినిమా మార్కెట్ 30 నుంచి 40 కోట్లు వుంది కాబట్టి, ఆ రేంజ్ లోనే సినిమా చేయించాలని ప్లాన్ చేసారు. అలా తయారైన సినిమానే కవచం.

ఈ సినిమా బడ్జెట్ 30 కోట్ల లోపే. 28 వరకు అయింది. అయితే హిందీ డబ్బింగ్, రీమేక్ రైట్స్ నే తొమ్మిది కోట్లు వచ్చాయి. ఆంధ్రను 8 కోట్ల రేషియోలో ఇచ్చారు. సీడెడ్ 3 కోట్లు. కర్ణాటక కోటి, ఓవర్ సీస్ 60 లక్షలు. అంటే ఇరవై రెండు వరకు రికవరీ వచ్చింది.

ఇంకా శాటిలైట్, డిజిటల్ కూడా వున్నాయి. శాటిలైట్ మూడుకోట్ల రేంజ్ లో బేరం జరుగుతోంది. అలాగే డిజిటల్ కూడా ఇంచుమించు అదేరీతిలో. ఈ రెండూ అయిపోతే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. నైజాం ఏరియా లాభం కింద వుంటుంది.

నైజాం ఎంత వస్తే అంత మిగులు అన్నమాట. ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయిందనే, ఇప్పుడు చేస్తున్న తేజ సినిమా బడ్జెట్ కూడా ఇదే మాదిరిగా వుండేలా చూసుకుంటున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్