సందీప్ కిషన్ ఈసారి కామెడీ దారిపడుతున్నారు. అనేక కామెడీ సినిమాలు తీసిన డైరక్టర్ నాగేశ్వర రెడ్డితో జతగట్టి సినిమా చేయబోతున్నాడు. టైటిల్ కూడా కాస్త ఫన్ తోనే వుంది. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ అన్నది టైటిల్. నాగేశ్వర రెడ్డికి కామెడీ పల్స్ తెలుసు. సరైన సబ్జెక్ట్, హీరో సెట్ కావడంలేదు.
ఇప్పుడు సబ్జెక్ట్ అయితే మాంచి ఎంటర్ టైన్ మెంట్ తో, అవుట్ అండ్ అవుట్ ఫన్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి సందీప్ కిషన్ కామెడీ టైమింగ్ ఎలా వుంటుందో చూడాలి. కొత్త బ్యానర్ పై ఈ సినిమాను ఇవ్వాళో, రేపో ప్రకటిస్తారు.
త్వరలో పట్టాలెక్కే ఈ సినిమాకు మిగిలిన హంగులు డిసైడ్ చేయాల్సి వుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ ఏంటీ సినిమా విడుదలకు సిద్దంగా వుంది. మరో సినిమా షూట్ లో వుంది.