హీరో రవితేజకు అదేంటో పాపం, అన్నీ ఒకేసారి ఒకే స్టయిల్ పాత్రలు క్యూ కట్టేసాయి. ఇప్పుడు చేస్తున్న శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో మూడుపాత్రలు. వాస్తవానికి హీరో ఒక్కడే. క్యారెక్టర్ ఒక్కటే. కానీ అపరిచితుడు మాదిరిగా మూడు షేడ్స్ లో కనిపిస్తాడు. అంతేతప్ప త్రబుల్ రోల్ మాత్రంకాదు.
దాని తరువాత చేయాల్సిన సంతోష్ శ్రీనివాస్ తమిళ సినిమా తెరి రీమేక్ లో రెండు షేడ్స్ వుండే ఒకటే క్యారెక్టర్. దీని తరువాత చేయాల్సినవి ఐ ఆనంద్ సినిమా ఒకటి వుంది. ఆ మధ్య నేలటికెట్ తీసిన నిర్మాతల సినిమా ఇది. ఇందులో కూడా రవితేజ కు రెండు క్యారెక్టర్లు. కానీ స్పెషల్ ఏమిటంటే పక్కా డబుల్ యాక్షన్ సినిమా ఇది.
అంటే మూడు సినిమాలతో మొత్తం ఏడు క్యారెక్టర్లు చూపించేయబోతున్నాడన్నమాట. అయితే వీటిలో సంతోష్ శ్రీనివాస్ సినిమాను పక్కనపెట్టారు. దీనికి కారణాలు రెండు వినిపిస్తున్నాయి. ఒకటి వరుసగా ఇలా మల్టిపుల్ రోల్స్ చేయడం బాగుండదేమో? అని రవితేజ అనుకున్నారని. కానీ రవితేజ ది అలా సందేహించే వ్యవహారం కాదు. మరొకటి హిందీ శాటిలైట్ వ్యవహారంలో ఏదో తేడా వచ్చిందని. రవితేజ భారీ యాక్షన్ సినిమాలకు హిందీ డిజిటల్ శాటిలైట్ రేటు బాగా పలుకుతుంది. దీనికి కూడా అంతే.
కానీ ఇది తెరి రీమేక్ కావడంతో, అక్కడ ఏదో అడ్డంకి వచ్చి, తేడా జరిగిందని, అందుకే ఈ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టారని వినిపిస్తోంది. ఏమిటో పాపం, డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ కు అయితే డిజాస్టర్లు, లేకుంటే ఆగిపోయే సినిమాలు. ఎప్పుడు అడ్డంకులు దాటుకుని, సినిమా చూపిస్తారో?