లారెన్స్ సినిమాకు డిమాండ్ తగ్గిందా?

లారెన్స్ దెయ్యాల సినిమాలంటే టాలీవుడ్ లో హాట్ కేక్ లే. కానీ అలాంటిది శివగంగ సినిమాకు మాత్రం తెలుగునాట బయ్యర్లు దొరికినట్లు లేదు. ఎందుకనో తెలుగులో కాస్త పేరున్న నిర్మాతలు, బయ్యర్లు ఈ సినిమా…

లారెన్స్ దెయ్యాల సినిమాలంటే టాలీవుడ్ లో హాట్ కేక్ లే. కానీ అలాంటిది శివగంగ సినిమాకు మాత్రం తెలుగునాట బయ్యర్లు దొరికినట్లు లేదు. ఎందుకనో తెలుగులో కాస్త పేరున్న నిర్మాతలు, బయ్యర్లు ఈ సినిమా దృష్టికి పోలేదు. మరీ దగ్గర చేసి తెలుగులో ఎవరైనా కనీసం పంపిణీచేస్తారా? అని విచారణ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన ఒకరిద్దరు, టైమ్ సరిపోదని, పబ్లిసిటీ కుదరదని తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఆఖరికి కొత్త నిర్మాత రమేష్ పిళ్లై ఈ సినిమాను కొని, సురక్ష శివకుమార్ కు పంపిణీ కి అప్పగించారు. ఇదిలా వుంటే ఈ సినిమాతో శివలింగ దర్శకుడు వాసు కుమారుడు శక్తివాసు తెలుగు వారికి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా రెండో సగం చాలా వరకు శక్తి వాసు మీదే నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాల కథనం.