రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ ను విడుదల చేశారు. చరణ్, సుకుమార్ లు తమ తమ ఫేస్ బుక్ పేజీల ద్వారా ఈ సినిమాకు సంబంధించి తొలి రూపును ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం తో సాగుతుందని, చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రను చేస్తున్నాడన్న సమాచారానికి సమర్థింపులా ఉంది ఫస్ట్ లుక్.
సుకుమార్ సినిమాలు ఎలాగూ ప్రయోగాత్మక రీతిలోనే ఉంటాయి, ఈ పోస్టర్ కూడా ఆ వెరైటీకి ప్రతీకగా ఉండటంతో చరణ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రయోగాత్మక సినిమాలు, విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమ హీరోపై ఉన్న విమర్శలకు ఈ ఒక్క పోస్టరే ఫుల్ స్టాప్ పెడుతోందని వారు ఆనందంగా చెబుతున్నారు.