చరణ్ – సుకుమార్.. ఫస్ట్ పోస్టర్!

రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ ను విడుదల చేశారు. చరణ్, సుకుమార్ లు తమ తమ ఫేస్ బుక్ పేజీల…

రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ ను విడుదల చేశారు. చరణ్, సుకుమార్ లు తమ తమ ఫేస్ బుక్ పేజీల ద్వారా ఈ సినిమాకు సంబంధించి తొలి రూపును ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం తో సాగుతుందని, చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రను చేస్తున్నాడన్న సమాచారానికి సమర్థింపులా ఉంది ఫస్ట్ లుక్.

సుకుమార్ సినిమాలు ఎలాగూ ప్రయోగాత్మక రీతిలోనే ఉంటాయి, ఈ పోస్టర్ కూడా ఆ వెరైటీకి ప్రతీకగా ఉండటంతో చరణ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రయోగాత్మక సినిమాలు, విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమ హీరోపై ఉన్న విమర్శలకు ఈ ఒక్క పోస్టరే ఫుల్ స్టాప్ పెడుతోందని వారు ఆనందంగా చెబుతున్నారు.