నిప్పువుందన్న మాట మారుతీ ?

మారుతి దర్శకత్వంలో కోనేరు హవీష్ (జీనియస్ ఫేమ్) హీరోగా యువి క్రియేషన్స్ సినిమా అన్న గ్యాసిప్ ఒకటి బయటకు వచ్చింద. అది తెలిసి యువి క్రియేషన్స్ జనాలు బిత్తర పోయారని వినికిడి. మేమేంటీ..హవీష్ తో…

మారుతి దర్శకత్వంలో కోనేరు హవీష్ (జీనియస్ ఫేమ్) హీరోగా యువి క్రియేషన్స్ సినిమా అన్న గ్యాసిప్ ఒకటి బయటకు వచ్చింద. అది తెలిసి యువి క్రియేషన్స్ జనాలు బిత్తర పోయారని వినికిడి. మేమేంటీ..హవీష్ తో సినిమా ఏంటీ? అని తెలిసిన వారితో వాపోయారని వినికిడి. ఆ రాసే గ్యాసిప్ ఏదో మహేష్ తో సినిమా అనో, బన్నీతో సినిమా అనో రాయచ్చుగా అని కూడా జోకేసారట. 

అయితే ఈ వ్యవహారం వెనుక చాలా విషయం వున్నట్లు వినికిడి.ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు కదా.. ఎప్పుడో పూర్వాశ్రమంలో దర్శకుడు మారుతి ఈ హీరో యూనిట్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అంటే డైరక్షన్ చేస్తానని కాదు..తన సూపర్ విజన్ లో సినిమా నిర్మిద్దామని. ఆ కమిట్ మెంట్ ఎప్పటి నుంచో అలా వుంది. ఇప్పుడు హవీష్ తాలూకా జనం దాన్ని బయటకు తీసారని వినికిడి. మొత్తం పెట్టుబడి మేం పెడతాం..మీరు సినిమా చేయండి అని సంప్రదింపులు ప్రారంభించారని తెలుస్తోంది. 

కానీ మారుతి అందుకు ప్రస్తుతం అయితే సిద్ధంగా వున్నట్లు లేదు. మారుతి చేతిలో వెంకీ ప్రాజెక్టు వుంది..యువి-చరణ్ ప్రాజెక్టు వుంది. నిర్మాతగా రెండు ప్రాజెక్టులు డిస్కషన్ లో వున్నాయి. ఇవన్నీ కాకుండా మంత్రి గంటా తనయుడి ఆబ్లిగేషన్ వుండనే వుంది. 

ఇన్నింటి మధ్య హవీష్ ప్రాజెక్టు ఎక్కడ మెటీరియలైజ్ అవుతుంది? అనుమానమే?