సర్దార్ గబ్బర్ సింగ్..వీర హైప్ వచ్చిన సినిమా. ఎనభై నుంచి తొంభై కోట్ల మార్కెట్ జరిగిన సినిమా. కానీ శాటిలైట్ బేరం మాత్రం తెగడం లేదు. నిజానికి ఇంత హైప్ వచ్చిన తరువాత శాటిలైట్ హక్కలు ఎగరేసుకు పోవాలి. పైగా మెగా క్యాంప్ సినిమాలంటే మా టీవీ చెక్ బుక్ తో రెడీగా వుంటుంది.
కానీ అలాంటిది ఈ సినిమా ఇంతవరకు శాటిలైట్ కాలేదు. ఓ ఛానెల్ ఈ సినిమాకు పది కోట్ల వరకు ఆఫర్ ఇచ్చింది. కానీ సర్దార్ టీమ్ 12 కోట్లు కావాలని భీష్మించుకు కూర్చుంది. దాంతో బేరం తెగకుండా అలా వుండిపోయింది. సరే, ఈలోగా హీరో, నిర్మాత, దర్శకుడు అందరూ ప్రొడక్షన్ పనుల్లో వీర బిజీ అయిపోయారు.
అందువల్ల ఈ బేరసారాలు అబేయన్స్ లో పడిపోయాయి. పవన్ ఫారిన్ నుంచి తిరిగి రాగానే శరద్ మురార్ బేరం ఏదో ఓ పాయింట్ దగ్గర ఫైనల్ చేస్తారని వినికిడి.