నితిన్..టాలీవుడ్ లోని ఎలిజిబిల్ బ్యాచులర్లలో ఒకడు. కానీ పెళ్లి టాపిక్ ఎప్పుడూ వినిపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుంది హీరోయిన్ సమంత విషెష్ చెప్పేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్ అని తన ట్విట్టర్ విసెష్ లో పేర్కొంది. పుట్టిన రోజు పూటా విసెష్ చెబుతూ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అని సమంత అందీ అంటే సమ్ థింగ్ ఏదో వుండనే వుండాలి. అ..ఆ సెట్ మీద నితన్ తన హీరోయిన్ సమంత చెవిలో ఆ శుభవార్త ఏదో చెప్పే వుండాలి.
ఇదిలా వుంటే నితిన్ పుట్టిన రోజు సందర్భంగా అ..ఆ సెకెండ్ లుక్ వదిలారు. నితిన్ అందంగానే వున్నాడు.. కానీ ఒకటి సినిమాలో సీన్ మాదిరిగా కాకుండా, జస్ట్ ఓ స్టిల్ మాదిరిగా వుంది. రెండవది.. ఫస్ట్ లుక్ లో వెనక్కు తిరిగి వున్న నితిన్ ను ముందుకు తిప్పారు. బ్యాక్ పాక్, ఛేతిలో రెల్లుదుబ్బు ఓకె. కానీ జీన్స్ జేబులో పట్టు చున్నీనో , పట్టు చీర పైటనో వుంచారు.. అందెందుకో సినిమా చూస్తేనే తెలుస్తుంది. లుక్ జస్ట్ క్యాజువల్ గా వుంది.